iDreamPost
android-app
ios-app

కమిన్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్.. సూపర్బ్ నాక్​తో SRHను ఒడ్డున పడేశాడు!

  • Published May 21, 2024 | 9:44 PMUpdated May 21, 2024 | 9:44 PM

సన్​రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్​తో అలరించాడు. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును సూపర్బ్ నాక్​తో ఒడ్డున పడేశాడు.

సన్​రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్​తో అలరించాడు. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును సూపర్బ్ నాక్​తో ఒడ్డున పడేశాడు.

  • Published May 21, 2024 | 9:44 PMUpdated May 21, 2024 | 9:44 PM
కమిన్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్.. సూపర్బ్ నాక్​తో SRHను ఒడ్డున పడేశాడు!

ఐపీఎల్-2024 గ్రూప్ స్టేజ్​లో భారీ స్కోర్లతో రఫ్ఫాడించింది సన్​రైజర్స్ హైదరాబాద్. 250 ప్లస్ స్కోర్లను కూడా అవలీలగా బాదిపారేసింది. కానీ కీలకమైన ప్లేఆఫ్స్​లో మాత్రం దారుణంగా పెర్ఫార్మ్ చేసింది. కోల్​కతా నైట్ రైడర్స్​తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్​కు దిగింది ఎస్​ఆర్​హెచ్. అయితే 20 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. 19.3 ఓవర్లకు 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఒకదశలో 121 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్సీ ఇన్నింగ్స్​తో టీమ్​ను నిలబెట్టాడు ప్యాట్ కమిన్స్.

24 బంతుల్లో 2 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో 30 పరుగులు చేశాడు కమిన్స్. స్టార్క్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్​ భీకరంగా బౌలింగ్ చేస్తున్నా తట్టుకొని నిలబడ్డాడు ఎస్​ఆర్​హెచ్ కెప్టెన్. రివర్స్ స్వీప్​లు, ర్యాంప్ షాట్లతో పరుగులు రాబట్టాడు. ఆఖర్లో అతడు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడకపోతే ఆరెంజ్ ఆర్మీ ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. ఇవాళ బ్యాటింగ్​లో హెడ్, షాబాజ్ డకౌట్ అయ్యారు. అభిషేక్ శర్మ (3) కూడా నిరాశపర్చాడు. కాపాడతాడని అనుకున్న నితీష్ రెడ్డి (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. త్రిపాఠి (55), క్లాసెన్ (32) రాణించారు. అయితే రాంగ్ టైమ్​లో వీళ్లిద్దరూ ఔట్ అవడంతో టీమ్ కష్టాల్లో పడింది. చివర్లో కమిన్స్ ఆదుకోకపోతే టీమ్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అంత ఒత్తిడిలోనూ అతడు ఆడిన ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి