iDreamPost
android-app
ios-app

వీడియో: కీలక మ్యాచ్​లో హెడ్​ను ఔట్ చేసిన స్టార్క్.. 25 కోట్లకు న్యాయం చేశాడు!

  • Published May 21, 2024 | 8:10 PMUpdated May 21, 2024 | 8:15 PM

ఐపీఎల్-2024 మొత్తం బ్యాట్​తో హవా నడిపించాడు ఎస్​ఆర్​హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్. సూపర్బ్ నాక్స్​తో టీమ్​కు విక్టరీలు అందించాడు. అయితే కీలక మ్యాచ్​లో అతడు చేతులెత్తేశాడు.

ఐపీఎల్-2024 మొత్తం బ్యాట్​తో అదరగొడుతూ వచ్చాడు సన్​రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్. ధనాధన్ ఇన్నింగ్స్​లతో ప్రత్యర్థి జట్లను వణికించాడు. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేస్తూ టీమ్​కు సూపర్బ్ స్టార్స్ అందించాడు. అలాంటోడు కీలకమైన ప్లేఆఫ్స్​లో తుస్సుమన్నాడు. కోల్​కతా నైట్ రైడర్స్​తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో హెడ్ ఫెయిలయ్యాడు. 2 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్​కు చేరుకున్నాడు. కేకేఆర్ సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన స్టన్నింగ్ డెలివరీకి అతడు ఔట్ అయ్యాడు.

మిడ్ వికెట్​లో పడి వచ్చిన బంతిని బలంగా బాదుదామని అనుకొని ఓపెన్ అయ్యాడు హెడ్. అయితే బాల్ లైన్​ను పూర్తిగా మిస్సయ్యాడు. బాల్ ఆలస్యంగా స్వింగ్ అవడంతో అది లోపలకు వస్తుందని అనుకోలేదు. దీంతో అతడి బ్యాట్​ను దాటుకొని దూసుకెళ్లిన బంతి ఆఫ్ స్టంప్​ను గిరాటేసింది. పంజాబ్ కింగ్స్​తో గత మ్యాచ్​లోనూ అర్ష్​దీప్ సింగ్ బౌలింగ్​లో ఇదే రీతిలో ఔట్ అయ్యాడు హెడ్. హెడ్​తో పాటు నితీష్ కుమార్ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0)ను కూడా వెనక్కి పంపించాడు స్టార్క్. వరుస బంతుల్లో ఈ ఇద్దర్నీ ఔట్ చేశాడతను. సీజన్ మొత్తం చెత్త బౌలింగ్​తో ఉసూరుమనిపించిన స్టార్క్.. కీలక మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్​ మీద చెలరేగిపోతున్నాడు. మరి.. స్టార్క్ బౌలింగ్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి