iDreamPost
android-app
ios-app

షారుఖ్ సరసన ఛాన్స్ కొట్టేసిన రష్మిక?

  • Author ajaykrishna Published - 11:32 AM, Sat - 5 August 23
  • Author ajaykrishna Published - 11:32 AM, Sat - 5 August 23
షారుఖ్ సరసన ఛాన్స్ కొట్టేసిన రష్మిక?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన.. ప్రస్తుతం కెరీర్ లో పీక్ స్టేజ్ ని ఎంజాయ్ చేస్తోంది. వరుసగా స్టార్స్ సరసన సినిమాలు చేస్తూ.. స్టార్డమ్ సంపాదించుకుంటుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక.. వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా తమిళ, తెలుగు, హిందీ భాషలలో అవకాశాలు అందుకుంటుంది. ఇండస్ట్రీలో ఒక స్టేజ్ కి ఎదిగాక ఏ హీరోయిన్ కైనా.. ఫలానా స్టార్ తో సినిమాలు చేయాలని ఓ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఫుల్ మూవీ కాకపోయినా.. షారుఖ్ తో కనీసం కాసేపైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరుకుంటారు.

ఇప్పుడు అలాంటి కోరిక రష్మిక కెరీర్ లో నిజం కాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం రష్మిక.. అల్లు అర్జున్ సరసన పుష్ప 2, రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాలతో పాటు రెయిన్ బో అని కొత్త ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది. అయితే.. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రష్మిక బాద్షా షారుఖ్ సరసన అవకాశం అందుకుందట. ఇది ఆనందించే విషయమే కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. షారుఖ్ తో కలిసి రష్మిక చేయబోయేది సినిమా కాదట. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించనున్న కమర్షియల్ యాడ్ కోసమని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన బయటికి రావాల్సి ఉంది. కాగా.. ఈ విషయం తెలిసి రష్మిక ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. కెరీర్ పరంగా రష్మిక లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. గతంలో కెరీర్ పరంగా ఎప్పుడూ బిజీగా ఉండటమే తనకు సంతోషం కలిగించే విషయమని చెప్పింది. ఇప్పుడు లైఫ్ లో అదే చేస్తోంది. మరోవైపు పఠాన్ తో ఈ ఏడాది సాలిడ్ కంబ్యాక్ సక్సెస్ అందుకున్నాడు షారుఖ్. కెరీర్ లో రూ. 1000 కోట్ల మార్క్ దాటిన మూవీగా పఠాన్ నిలిచింది. ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ మూవీ చేస్తున్నాడు. తమిళ, హిందీ, తెలుగు భాషలలో సెప్టెంబర్ 7న సినిమా రిలీజ్ కాబోతుంది. కాగా.. ఇప్పటికే జవాన్ నుండి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకోనుందో చూడాలి. మరి స్క్రీన్ పై షారుఖ్, రష్మిక పెయిర్ ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

marsbahis girişjojobet girişjojobet