iDreamPost

VIDEO: కోహ్లీ, సచిన్‌ ఓకే.. రోహిత్‌కి షాకిచ్చిన రషీద్‌ ఖాన్‌!

  • Published Oct 13, 2023 | 6:40 PMUpdated Oct 13, 2023 | 6:40 PM
  • Published Oct 13, 2023 | 6:40 PMUpdated Oct 13, 2023 | 6:40 PM
VIDEO: కోహ్లీ, సచిన్‌ ఓకే.. రోహిత్‌కి షాకిచ్చిన రషీద్‌ ఖాన్‌!

క్రికెట్‌లో కొంతమంది స్టార్‌ క్రికెటర్లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. కొన్ని షాట్ల పేర్తు చెబితే వాళ్లే గుర్తుకు వస్తారు. కొంతమంది ఆటగాళ్లైతే ఏకంగా కొన్ని కొత్త షాట్లు కనిపెట్టారు. టీమిండియా మాజీ క్రికెటర్‌ ధోని.. హెలికాప్టర్‌ షాట్‌ కనిపెట్టాడు. పైగా ధోని ఆడినట్టు ఆ షాట్‌ను ఎవరూ ఆడలేరు. చాలా మంది క్రికెటర్లు హెలికాప్టర్‌ షాట్‌ను ట్రై చేశారు. అలాగే శ్రీలంక మాజీ క్రికెటర్‌ దిల్షాన్‌ ఆడే దిల్‌స్కూప్‌ షాట్‌కు ప్రత్యేకమే. అలాగే ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌.. ఆడే స్నేక్‌ షాట్‌ కూడా హైలెట్‌గా ఉంటుంది. ఈ షాట్లు అన్ని వాళ్లు వాళ్లు మాత్రమే బాగా ఆడతారు.

అయితే.. క్రికెట్‌లో సంప్రదాయమైన షాట్లు చాలా ఉన్నాయి. వాటిలో కవర్‌ డ్రైవ్‌, స్ట్రేట్‌ డ్రైవ్‌, పుల్‌షాట్‌, కట్‌ షాట్‌ ఇలా చాలా షాట్లు ఉన్నాయి. వీటిని ప్రతి క్రికెటర్‌ ఆడాల్సిందే. కానీ, ఎంత మంది ఆడినా.. ఆ షాట్ల పేర్లు వినగానే కొంతమంది మంది క్రికెటర్ల పేర్లు గుర్తుకు వస్తాయి. ఆ షాట్‌ను వాళ్లు ఆడినంత బాగా మరే క్రికెటర్ కూడా ఆడలేడు. నిజానికి వాళ్లు ఆడితేనే ఆ షాట్‌కు అందం వస్తుంది. అలాంటి షాట్లలో గురించి ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌ని ఆడగా.. రోహిత్‌ శర్మకు షాకిచ్చాడ రషీద్‌. ఫస్ట్‌.. కవర్‌ డ్రైవ్‌ అనగానే మీ మైండ్‌లో ఏ క్రికెటర్‌ వస్తాడని రషీద్‌ని ప్రశ్నించగా.. కోహ్లీ పేరు చెప్పాడు, అలాగే స్ట్రేట్‌ డ్రైవ్‌ అనగా సచిన్‌ టెండూల్కర్‌ పేరు చెప్పాడు. కానీ, పుల్‌ షాట్‌ అనగా.. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ పేరు చెప్పాడు.

నిజానికి ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో ఎవర్ని అడిగినా రోహిత్‌ శర్మ పుల్‌ షాట్‌ అద్భుతంగా ఆడతాడని చెబుతుంటారు. రోహిత్‌కు బాగా ఇష్టమైన షాట్‌ కూడా అదే. కానీ, రషీద్‌కు మాత్రం రోహిత్‌ శర్మ పుల్‌ షాట్‌ కంటే పీటర్సన్‌ పుల్‌షాట్‌ బాగా అనిపించినట్లు ఉంది. అందుకే రోహిత్‌ను కాదని పీటర్సన్‌ పేరు చెప్పాడు. రషీద్‌ చెప్పిన ఈ సమాధానంపై రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోహత్‌ శర్మ పుల్‌ షాట్‌ అద్భుతంగా ఆడతాడని.. తనలా పుల్‌షాట్‌ ఆడే క్రికెటర్‌ను తామింత వరకు చూడలేదంటూ పేర్కొంటున్నారు. మరి రషీద్‌ ఆన్సర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ఇదీ చదవండి: ఇండియా-పాక్ మ్యాచ్.. టీమ్ కు టెన్షన్ గా మారిన విరాట్ కోహ్లీ! కారణం..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి