iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో దారుణం.. బీర్ బాటిల్ కోసం యువకుడిని పొడిచి చంపారు!

హైదరాబాద్ లో దారుణం.. బీర్ బాటిల్ కోసం యువకుడిని పొడిచి చంపారు!

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు బీర్ బాటిల్ ఇవ్వలేదని అతన్ని కత్తితో పొడిచి చంపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు. ఆ తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఈ ఘటనకు దారి తీసిన అసలు కారణాలు ఏంటంటే?

పోలీసుల కథనం ప్రకారం.. సరూర్ నగర్ కు చెందిన సాయి వరప్రసాద్ (22), సర్వోదయ కాలనీకి చెందిన సాయి యాదవ్ (23) ఇద్దరు స్నేహితులు. అయితే, ఆదివారం రాత్రి ఇద్దరు స్థానికంగా ఉన్న వైన్స్ లో బీర్లు తీసుకుని జిల్లెలగూడ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదే సమయంలో అటు నుంచి సంతోష్ యాదవ్, నితీష్ గౌడ్, పవన్, కిరణ్ గౌడ్ అనే స్నేహితులు వెళ్తున్నారు. ఈ నలుగురు ఆ ఇద్దరి వద్ద ఉన్న బీర్ బాటిళ్లను చూశారు. ఆ బీర్లు మాకు ఇవ్వాలని వర ప్రసాద్ తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఈ ఇద్దరు స్నేహితులు మా బీర్ బాటిళ్లు మీకిచ్చేది ఏంటంటూ వారితో ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.

ఇక క్షణికావేశంలో ఊగిపోయిన నితీష్ గౌడ్.. సాయి వర ప్రసాద్ ను కత్తితో పొడిచాడు. దీంతో ఆ యువకుడు రక్తపు మడుగులో పడిపోయాడు. అతని స్నేహితుడు సాయి యాదవ్ వెంటనే స్పందించి పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. ఇక చికిత్స పొందుతూ సాయి వరప్రసాద్ సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణవార్త విని మృతుని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: వీడియో: కొడుకు కాలేజీ ఫీజు కోసం బస్సు కింద పడ్డ తల్లి!

gamdomCasibommarsbahis girişMarsbahisJojobetJojobet Giriş