iDreamPost

OTTలోకి వచ్చేసిన దేశ భక్తి మూవి ‘రామ్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

  • Published Mar 27, 2024 | 10:13 AMUpdated Mar 27, 2024 | 10:13 AM

Ram Movie OTT Streaming: భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఓటీటీలో వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి.

Ram Movie OTT Streaming: భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఓటీటీలో వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి.

  • Published Mar 27, 2024 | 10:13 AMUpdated Mar 27, 2024 | 10:13 AM
OTTలోకి వచ్చేసిన దేశ భక్తి మూవి ‘రామ్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ దున్నేస్తుంది. ప్రతివారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు ధియేటర్లో సినిమాలు మిస్ అయితే ఎప్పటికో బుల్లితెరపై దర్శనమిచ్చేవి. ఇప్పుడు డ్రెండ్ మారింది.. కొత్త సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. భారతీయ చిత్రాలే కాదు.. ఇతర భాష చిత్రాలు, వెబ్ సీరీస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, హర్రర్, యాక్షన్ తరహా చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. దేశ భక్తి నేపథ్యంలో రూపొందిన ‘రామ్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. స్ట్రీమింగ్ ఎక్కడ అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలు హవా కొనసాగిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రాలైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 16న ధియేటర్లోల రిలీజ్ అయిన చత్రం ‘రామ్’. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య అయ్యలసోమయాజుల, ధన్యా బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంతో మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మిహిరామ్ కి ఇది తొలి చిత్రమే అయినా మంచి పేరు తీసుకువచ్చింది. తాజాగా రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో కూడా ఈ చిత్రానికి మంచి ఆధరణ లభిస్తుంది.

A patriotic movie that has come to OTT

ఈ చిత్రం కథ విషయానికి వస్తే.. హైదరాబాద్ లోని హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్ హెడ్ గా రియాజ్ అహ్మద్ (సాయి కుమార్) వ్యవహరిస్తుంటారు. అదే డిపార్ట్ మెంట్ లో జేబీ (భాను చందర్) ఎంతో చురుకైన ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంటారు. జేబీ పని చేస్తున్న టీమ్ ఓ మిషన్ కోసం వెళ్తారు.. అక్కడ జేబీ పై అధికారి సూర్యప్రకాష్ (రోహిత్) అనుకోకుండా చనిపోతాడు. ఆయన కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల) ని  అదే డిపార్ట్‌మెంట్ లోకి వచ్చేందుకు జేబీ ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ మాత్రం తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ మెంట్ చేస్తూ ఏదీ పట్టించుకోడు. అలాంటి సమయంలో జాహ్నవి (ధన్య బాలకృష్ణ) ప్రేమలో పడతాడు రామ్. ఆమె జేబీ కూతురు.. తన కూతురుని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండీషన్లు పెడతాడు. మరి ఆ కండీషన్లకు రామ్ ఒప్పుకుంటాడా? ఆ కండీషన్లు ఏంటీ? వాటిలో విజయం సాధిస్తాడా? అన్నది తెరపై చూడల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి