iDreamPost
android-app
ios-app

‘వ్యూహం-శపథం’ ట్రైలర్ రిలీజ్.. మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసిన RGV!

  • Published Feb 13, 2024 | 6:10 PM Updated Updated Feb 13, 2024 | 6:10 PM

Vyooham-shapadham Movie Release Trailers: ఆర్జీవీ తెరకెక్కించిన సినిమాలు 'వ్యూహం' దాని సీక్వెల్ 'శపథం' ఈ రెండు చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకురాబోతున్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ 'వ్యూహం-శపథం' రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

Vyooham-shapadham Movie Release Trailers: ఆర్జీవీ తెరకెక్కించిన సినిమాలు 'వ్యూహం' దాని సీక్వెల్ 'శపథం' ఈ రెండు చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకురాబోతున్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ 'వ్యూహం-శపథం' రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

‘వ్యూహం-శపథం’ ట్రైలర్ రిలీజ్.. మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసిన RGV!

రామ్ గోపాల్ వర్మ.. టాలీవుడ్ లో వివాదాస్పద డైరెక్టర్ గా పేరొందిన విషయం తెలిసిందే. తన సినిమాలతో ఎక్కడా లేని కాంట్రవర్సీని క్రియేట్ చేయడంలో ఆర్జీవీకి మరెవరూ సాటిలేరనే చెప్పాలి. ఇక తన మూవీలకు ప్రమోషన్స్ చేసుకున్నట్లు కూడా ఇంకే డైరెక్టరూ, హీరోలు చేసుకోరనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. తాజాగా ఆర్జీవీ తెరకెక్కించిన సినిమాలు ‘వ్యూహం’ దాని సీక్వెల్ ‘శపథం’ ఈ రెండు చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకురాబోతున్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ ‘వ్యూహం-శపథం’ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ సంఘటనలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొన్నాడు? ఎలా సీఎం అయ్యాడు? అనే కథాంశం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘వ్యూహం’. ఈ మూవీ రెండు పార్టులుగా రానుంది. అందులో తొలి భాగం ‘వ్యూహం’, రెండో భాగం ‘శపథం’ పేరుతో రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే ఆర్జీవీ ప్రకటించాడు. అయితే తాజాగా వ్యూహం-శపథం మూవీల రిలీజ్ ట్రైలర్స్ ను ఒకటేసారి విడుదల చేసి ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్. కాగా.. గతేడాదిలోనే ఈ చిత్రాలు రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. పలు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో వాటిని తప్పించుకుని ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వ్యూహం ఫిబ్రవరి 23న, సెకండ్ పార్ట్ శపథం మార్చి 1న రిలీజ్ కానున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా విడుదల చేసిన వ్యూహం-శపథం ట్రైలర్ అభిమానులను అలరిస్తోంది.

సీఎం జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ అదరగొట్టాడు. ఇక వైఎస్ భారతి పాత్రలో మానస రాధా కృష్ణన్ ఒదిగిపోయారనే చెప్పాలి. అప్పట్లో వివిధ రాజకీయ నాయకులు చేసిన కుట్రలను జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా తిప్పికొట్టి.. సీఎం అయ్యాడో ఈ సినిమాలో చూపించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ ఈ మూవీ ద్వారా సెటైర్స్ బాగానే వేసినట్లుగా ట్రైలర్ లో కనిపిస్తోంది. ఆ టైమ్ లో జరిగిన అల్లర్లు, కుట్రలను ప్రజలకు తెలియజేసే విధంగా సినిమాను రూపొందించినట్లు చూస్తేనే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ ట్రైలర్ ను చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: సెట్స్ పైకి సలార్-2? 9 నెలలు ముందే ఊచకోత స్టార్ట్!