iDreamPost

RGV బ్యూటీ ఇలా మారిందేంటీ.. గ్లామర్ డాల్ నుండి.. ఆథ్యాత్మికత దిశగా

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎంత చర్చనీయాంశంగా మారుతాయో.. ఆయన సినిమాలో నటించే అమ్మాయిలు కూడా అంతే ఫేమస్ అవుతుంటారు. ఆర్టీవీతో సినిమాలు చేసే హీరోయిన్లపై ప్రేక్షకుల దృష్టి కూడా ఎక్కువనే ఉంటుంది. వారిలో ఒకరు..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఎంత చర్చనీయాంశంగా మారుతాయో.. ఆయన సినిమాలో నటించే అమ్మాయిలు కూడా అంతే ఫేమస్ అవుతుంటారు. ఆర్టీవీతో సినిమాలు చేసే హీరోయిన్లపై ప్రేక్షకుల దృష్టి కూడా ఎక్కువనే ఉంటుంది. వారిలో ఒకరు..

RGV బ్యూటీ ఇలా మారిందేంటీ..  గ్లామర్ డాల్ నుండి.. ఆథ్యాత్మికత దిశగా

ఓ మూస ధోరణిలో కొట్టుకుపోతున్న తెలుగు ఇండస్ట్రీ గతిని మార్చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, 1989లో శివ మూవీతో సినిమా అంటే ఇది అని నిరూపించాడు. టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ మూవీలను మేకోవర్ చేశాడు. శివ నుండి ఇప్పుడు చేయబోతున్న శారీ మూవీ వరకు ఆయన దర్శకత్వం స్టైల్లో మార్పులు చోటుచేసుకున్న సంగతి విదితమే. ఇక ఆర్జీవీతో పాటు ఆయన సినిమాల్లో నటించే హీరోయిన్లపై కూడా ఇంట్రస్ట్ చూపిస్తుంటారు ప్రేక్షకులు. ఇండస్ట్రీకి కొత్త కొత్త ముద్దుగుమ్మలను పరిచయం చేయడంలో ముందువరుసలో ఉండే దర్శకుల్లో ఈయన కూడా ఒకరు. అలాగే ఫేం కోసం తాపత్రయపడుతున్న హీరోయిన్లను తీసుకు వచ్చి.. లైఫ్ ఇస్తుంటాడు. అలాంటి వారిలో ఒకరు నిషా కొఠారి అలియాస్ ప్రియాకం కొఠారి అలియాస్ అమోఘ.

ఈమె గురించి ఇప్పటి ప్రేక్షకులను పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ.. 90 కిడ్స్ ఆమె ఒక క్రష్. బెంగాల్‌లో పుట్టిన ప్రియాంక..చదువుల నిమిత్తం ఢిల్లీకి వచ్చింది. ఆమె కథక్ డ్యాన్సర్. ఎడ్యుకేషన్ పూర్తయ్యాక మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె ఫోటోలను చూసి హీరో మాధవన్.. జైజై అనే తమిళ మూవీకి రికమెంట్ చేశాడు. అలా అమోఘ పేరుతో ఇంట్రడ్యూస్ అయ్యింది. అప్పుడే రామ్ గోపాల్ వర్మ కళ్లల్లో ఈ బ్యూటీ పడటంతో.. మధ్యాహ్నం హత్య అనే చిత్రాన్ని చేశాడు. ఇక అప్పటి నుండి ఆర్జీవీ ఆస్థాన హీరోయిన్ అయిపోయింది. హిందీలో జేమ్స్ (ఆర్జీవీ ప్రొడ్యూసర్), సర్కార్, శివ వంటి చిత్రాలు చేసింది. తెలుగులో బాలకృష్ణ సరసన ఒక్కమగాడు చిత్రంలో యాక్ట్ చేసింది అమ్మడు. ఇందులో గ్లామరస్ రోల్ చేసింది. అడవిలో నితిన్ సరసన కనిపించింది.

సైకో,క్రిమినల్స్, నువ్వే నా బంగారం, బుల్లెట్ రాణీ వంటి చిత్రాల్లో మెరిసింది. పునీత్ రాజ్‌కుమార్ సరసన ‘రాజ్ ది షోమ్యాన్‌’తో శాండల్‌వుడ్ ఎంట్రీ ఇచ్చింది. దండుపాళ్యంలో ఓ పాత్రలో మెరిసింది. మలయాళ ఇండస్ట్రీ మినహాయించి అన్ని పేరు మోసిన సినీ పరిశ్రమల్లో ఆమె వర్క్ చేసింది.  ఇక అవకాశాలు తగ్గడంతో 2016లో భాస్కర్ ప్రకాశ్ అనే వ్యక్తిని మనువాడింది. ఆ తర్వాత అలా ఇలా ఎలా అనే ఓ చిత్రంలో స్పెషల్ అఫీయరెన్స్ ఇచ్చింది. ఆ మధ్య కాలంలో ఆథ్యాత్మిక చింతనలో గడుపుతూ కనిపించింది. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాకు కాస్త దూరంగా జీవిస్తున్నట్లు తెలుస్తుంది. అప్పుడప్పుడు తన ఆథ్యాత్మిక చింతనకు సంబంధించిన పిక్స్ ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి