iDreamPost
android-app
ios-app

చిక్కుల్లో పాయల్ రాజ్ పుత్.. నిర్మాతల మండలికి అందిన ఫిర్యాదు!

Complaint On Payal rajput By Movie Producer: పాయల్ రాజ్ పుత్ కు కొత్త చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. నిర్మాత తనను వేధిస్తున్నాడు అంటూ ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే ఆమెపై నిర్మాత ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

Complaint On Payal rajput By Movie Producer: పాయల్ రాజ్ పుత్ కు కొత్త చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. నిర్మాత తనను వేధిస్తున్నాడు అంటూ ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే ఆమెపై నిర్మాత ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

చిక్కుల్లో పాయల్ రాజ్ పుత్.. నిర్మాతల మండలికి అందిన ఫిర్యాదు!

ఆర్ఎక్స్ 100 మూవీతో పాయల్ రాజ్ పుత్ కు తెలుగులో చాలా మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఈ అమ్మడు రెండ్రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆమెను బెదిరిస్తున్నారని.. బలవంతంగా సినిమా ప్రమోషన్స్ చేయించాలని చూస్తున్నారంటూ ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్టు ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ కు లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె మీద సినిమా నిర్మాత.. నిర్మాణ మండలికి ఫిర్యాదు చేశాడు. పూర్తి రెమ్యూనరేషన్ ఇచ్చినా కూడా ఆమె.. ప్రమోషన్స్ కు రావడం లేదు అంటూ నిర్మాతల మండలికి ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. ఈ ఫిర్యాదుతో పాయల్ చిక్కుల్లో పడింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పాయల్ రాజ్ పుత్ నటించిన రక్షణ అనే సినిమా దాదాపుగా ఐదేళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే సినిమా రిలీజ్ కాకముందే నిర్మాత- హీరోయిన్ మధ్య పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్నట్లు తేటతెల్లమైంది. మూవీ ప్రొడ్యూసర్ ప్రదీప్ ఠాకూర్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ఆమెకు ఇవ్వాల్సిన రూ.6 లక్షల పారితోకాన్ని ఇచ్చేసినట్లు నిర్మాత వెల్లడించారు. అయినా కూడా మూవీ ప్రమోషన్స్ కి పాయల్ రాజ్ పుత్ సహకరించడం లేదు అంటూ తాను చేసిన ఫిర్యాదులో వెల్లడించారు. ఈ విషయాన్ని నిర్మాతల కౌన్సిల్ సోషల్ మీడియాలో వేదికగా వెల్లడించింది. అలాగే ప్రొడ్యూసర్ ప్రదీప్ ఠాకూర్ చేసిన ఫిర్యాదు కాపీని కూడా షేర్ చేశారు. పాయల్ రాజ్ పుత్ నిర్మాత తనను బెదిరిస్తున్నాడు అంటూ ఆరోపించిన కొన్ని గంటల్లోనే వెలువడింది.

అయితే నిర్మాత ప్రదీప్ ఠాకూర్ తమకు ఈ ఫిర్యాదును మార్చినెలలోనే ఇచ్చినట్లు నిర్మాతల మండలి తమ ప్రెస్ నోట్ వెల్లడించింది. అలాగే రక్షణ మూవీలో పాయల్ రాజ్ పుత్ నటించిందని.. ఆమె పేరును వాడుకునే హక్కు నిర్మాతకు ఉంటుంది అంటూ నిర్మాతల మండలి స్పష్టం చేసింది. అలాగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. పాయల్ ఏమని ఆరోపణలు చేసిందంటే.. “నేను రక్షణ అనే సినిమా చేశాను. 2019-20ల్లో 5 డబ్ల్యూస్ అనే సినిమా చేశాను. కానీ, ఆ సినిమా రిలీజ్ వాయిదా పడింది. వాళ్లు నా సక్సెస్ ని వాడుకోవాలని చూస్తున్నారు. మిగిలిన పారితోషకం ఇవ్వకుండా నన్ను సినిమా ప్రమోట్ చేయాలంటూ బెదిరిస్తున్నారు. ముందే చేసుకున్న కొన్ని ఒప్పందాల నేపథ్యంలో నేను అందుబాటులో ఉండనని నా టీమ్ చెప్పినా కూడా వాళ్లు వినడం లేదు. నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. అంటూ పాయల్ రాజ్ పుత్ పోస్ట్ చేసింది.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/