iDreamPost
android-app
ios-app

‘జైలర్’ అబోవ్ యావరేజ్ అని ఫీలయ్యాను! రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్..

  • Author Soma Sekhar Published - 12:16 PM, Tue - 19 September 23
  • Author Soma Sekhar Published - 12:16 PM, Tue - 19 September 23
‘జైలర్’ అబోవ్ యావరేజ్ అని ఫీలయ్యాను! రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్..

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘జైలర్’. ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రిలీజ్ అయిన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 700 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమాకు భారీ లాభాలు రావడంతో నిర్మాత కళానిథిమారన్ చిత్ర బృందానికి బహుమతులను ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ తో సహా.. సినిమాకు పనిచేసిన వారందరికి బహుమతులు ఇచ్చాడు కళానిథిమారన్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ను చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. జైలర్ మూవీని తొలుత తాను అబోవ్ యావరేజ్ ఫిల్మ్ అనుకున్నాను అంటూ రజినీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ గా నటించిన జైలర్ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో.. చిత్ర బృందం చెన్నైలో తాజాగా విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ వేడుకలో సూపర్ స్టార్ ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వేడుకలో రజినీకాంత్ మాట్లాడుతూ..”ముందుగా కళానిథి మారన్ సర్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే.. ఆడియో లాంచ్ దగ్గర్నించి.. మూవీ హిట్టయ్యేవరకు ఆయన మార్క్ చూపించారు. ఇక సినిమా హిట్ అవ్వగానే.. ఆర్టిస్టులందరినీ పిలిచి విందు భోజనం పెట్టారు. ఆ తర్వాత మా అందరికి బహుమతులు కూడా ఇచ్చారు. సినిమాకు పనిచేసిన వారికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చారని తెలియగానే నేను ఆశ్చర్యపోయాను. ఆర్టిస్టులను ఎలా గౌరవించాలో ఆయనను చూసి నేర్చుకోవాలి” అంటూ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.

కాగా.. అసలైన స్పీచ్ ఇక్కడి నుంచే మెుదలైంది. తలైవా మాట్లాడుతూ..”సినిమా పూర్తి అయిన తర్వాత ఎలా ఉందని సెంబియన్, కన్నన్ ను కళానిథి అడిగారు. కన్నన్ చాలా బాగుందని ఆన్సర్ ఇచ్చాడు. అయితే నువ్వు నెల్సన్ ఫ్రెండ్ వి అబద్దం చెప్పే ఛాన్స్ ఉంది. సెంబియన్ నువ్వు చెప్పు అనగానే అతడు యావరేజ్ సర్ అన్నాడు. అయితే నిజం చెప్పాలంటే.. రీరికార్డింగ్ కంటే ముందు నాక్కూడ ఈ మూవీ అబోవ్ యావరేజ్ అనిపించింది. కానీ అనిరుధ్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఈ సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్లాడు. అనిరుధ్ ఇప్పుడు నా కొడుకు” అంటూ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు సూపర్ స్టార్. ప్రస్తుతం సూపర్ స్టార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetorder girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş