iDreamPost

ఒకేఒక్కడు.. రజత్‌ పాటిదార్.. ఒక్క మ్యాచ్‌తో ఎన్ని రికార్డులు సాధించాడో తెలుసా??

ఒకేఒక్కడు.. రజత్‌ పాటిదార్.. ఒక్క మ్యాచ్‌తో ఎన్ని రికార్డులు సాధించాడో తెలుసా??

బుధవారం రాత్రి IPL2022లో ఎలిమినేటర్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన RCBలో కోహ్లీ, మ్యాక్స్ వెల్, డుప్లిసిస్ ఇలా అందరూ త్వరగానే అవుట్ అవ్వగానే RCB అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా యువ క్రికెటర్ రజత్‌ పాటిదార్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ మార్క్‌ అందుకొని మొత్తంగా 54 బంతుల్లో 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి RCBకి విజయం అందించాడు.

 

నిన్నటి మ్యాచ్ లో స్పెషల్ గా నిలిచిన రజత్‌ పాటిదార్ ఒక్క మ్యాచ్ తో IPLలో పలు రికార్డులను సాధించాడు.

*RCB తరపున నాకౌట్‌ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా రజత్‌ పాటిదార్‌ రికార్డ్ సృష్టించాడు.

*ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో RCB తరపున అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా రజత్‌ పాటిదార్‌(54 బంతుల్లో 112, 12 ఫోర్లు, 7 సిక్సర్లు) నిలిచి క్రిస్‌ గేల్‌(89 పరుగులు)ను అధిగమించాడు.

*అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా IPLలో సెంచరీ అందుకున్న నాలుగో ఆటగాడిగా రజత్‌ పాటిదార్‌ నిలబడ్డాడు. రజత్‌ కంటే ముందు ఈ వరుసలో పాల్‌ వాల్తాటి, మనీష్‌ పాండే, దేవదత్‌ పడిక్కల్‌ ఉన్నారు.

*అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా, ఓవరాల్‌గా ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల్లో సెంచరీ అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు రజత్‌ పాటిదార్. అంతకుముందు సెహ్వాగ్‌, షేన్‌ వాట్సన్‌, వృద్దిమాన​ సాహా, మురళీ విజయ్‌లు ఈ ఘనత సాధించారు.

*ఈ మ్యాచ్ తో IPLలో అత్యధిక స్కోరు సాధించిన అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు మనీష్‌ పాండే 94 పరుగులు, మన్విందర్‌ బిస్లా 89 పరుగులను ఈ మ్యాచ్ తో అధిగమించాడు రజత్‌ పాటిదార్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి