iDreamPost

రాజస్థాన్ డాక్టర్ కు కరోనా వైరస్ !!!

రాజస్థాన్ డాక్టర్ కు కరోనా వైరస్ !!!

చైనా తదితర దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. చైనా దేశంలో ఎంబీబీఎస్ చదివిన ఓ వైద్యవిద్యార్థి తిరిగి భారతదేశానికి రాగా అతనికి కరోనా వైరస్ లక్షణాలున్నాయని, దీంతో అతన్ని జైపూర్ నగరంలోని ఎస్ఎంఎస్ వైద్యకళాశాలలోని ఐసోలేషన్ వార్డుకు తరలించామని రాజస్థాన్ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి రఘు శర్మ చెప్పారు. కరోనా వైరస్ అనుమానిత రోగితోపాటు అతని కుటుంబసభ్యుల రక్త శాంపిళ్లను సేకరించి పరీక్షించేందుకు పూణే నగరంలోని జాతీయ వైరాలజీ లాబోరేటరీకి పంపించామని మంత్రి పేర్కొన్నారు.

Read Also: వణికిస్తున్న కరోనా…

చైనా దేశం నుంచి 18 మంది రాజస్థాన్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు తిరిగి వచ్చారని, వారందరినీ తమ వైద్యాశాఖ అధికారులు, వైద్యులు 28 రోజుల పాటు పరిశీలిస్తున్నారని మంత్రి రఘుశర్మ చెప్పారు. చైనా నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో వైద్యులు పరీక్షలు జరిపించిన తర్వాతే వారి స్వస్థలాలకు పంపించాలని మంత్రి రఘుశర్మ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే వివిధ దేశాలు ఈ వైరస్ గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. చైనా నుంచి వచ్చిన వారిని క్షుణ్ణంగా పరిశీలించాకనే తమదేశంలోకి అనుమతిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి