iDreamPost

అరుణాచల్ ప్రదేశ్ మాదే.. బుద్ధి మార్చుకోకుండా చైనా మొండి వాదన!

  • Published Mar 26, 2024 | 2:58 PMUpdated Mar 26, 2024 | 2:58 PM

ఇటీవలే భారతదేశ భూభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ భూభాగం అంటూ చైనా దేశం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటి పై భారత విదేశాంగ మంత్రి దీటుగా సమాధానం తెలిపారు. అయిన తన బుద్ధి మార్చుకోని చైనా మరోసారి భరత్ పై నోరుపారేసుకుంది.

ఇటీవలే భారతదేశ భూభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ భూభాగం అంటూ చైనా దేశం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటి పై భారత విదేశాంగ మంత్రి దీటుగా సమాధానం తెలిపారు. అయిన తన బుద్ధి మార్చుకోని చైనా మరోసారి భరత్ పై నోరుపారేసుకుంది.

  • Published Mar 26, 2024 | 2:58 PMUpdated Mar 26, 2024 | 2:58 PM
అరుణాచల్ ప్రదేశ్ మాదే.. బుద్ధి మార్చుకోకుండా చైనా మొండి వాదన!

ఇటీవలే భారతదేశ భూభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ భూభాగం అంటూ చైనా దేశం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే చైనా మొండి వాదనను భారత్‌ పదే పదే ఖండిస్తున్నా.. ఆ దేశం మళ్లీ పాత ప్రస్తవననే తీసుకు వస్తుంది. ఇక ఈ వ్యాఖ్యలపై భారత్ హాస్యాస్పదమైనవంటూ స్పందించిన.. చైనా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ ను పర్యటించిన తర్వాత నుంచే చైనా మరోసారి తన వాదనాలను మరింత గొంతు పెగిలించింది. ఇక ఈ విషయం పై భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తాజాగా స్పందించారు. ఈ క్రమంలోనే చైనా చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు ధీటుగానే స్పందించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొంతకాలంగా అరుణాచల్ ప్రదేశ్ పై చైనా చేస్తున్న మొండి వ్యాఖ్యలపై భారత్ పదే పదే ఖండిస్తునే వస్తున్న ఆ దేశం మళ్లీ పాత ప్రస్తావననే తీసుకు వస్తుంది. దీంతో చైనా వైఖరి హాస్యాస్పదమంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తాజాగా స్పందించారు. అలాగే చైనా చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు ఆయన దీటుగానే సమాధానం తెలిపింది. ఈ క్రమంలోనే.. చైనా చేస్తున్న ఈ ఆరోపణలు కొత్తమీ కాదని, కాకపోతే ఆ వాదనలను మరింతగా పెంచింది. అయితే చైనా చేసిన వ్యాఖ్యలు హాస్యస్పదంగానే ఉన్నాయి. ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలు కూడా అంతే. అని భారత విదేశాంగ ఖాఖ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను.. చైనా మరోసారి అరుణాచల్ ను భారత్ ను ఆక్రమించుకుందని నోరుపారేసుకుంది. కాగా, అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్‌ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో.. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నడు పరిష్కారం కాలేదు. అది ఎప్పుడు చైనాలో భాగమే. ఆ ప్రాంతంలో చైనా పరిపాలన కూడా సాగేది. కాగా, 1987లో భారత్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని అరుణాచల్ ప్రదేశ్ గా మార్చుకుంది. ఇక ఈ చర్యలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నాం. దీనిపై చైనా వైఖరిలో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది.

అయితే ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్‌ ప్రదేశ్ ను సందర్శించిన తర్వాతనే.. ఆ భూభాగం తమదేనంటూ చైనా తమ వంకర బుద్ధిని చూపిస్తూ.. పదే పదే మొండి ప్రకటనలు చేస్తుంది. అదే విధాంగా చైనా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అని ప్రకటనలు చేయటం ఈ నెలలో ఇది నాలుగోసారి కావడం గమన్హారం. పైగా అరుణాచల్ ను ఆ దేశం దక్షిణ టిబెట్ గా పేర్కొంది. మరి, అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో భూభాగం అంటూ చైనా చేస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి