iDreamPost
android-app
ios-app

కన్న కొడుకుని దారుణంగా కొట్టి చంపిన తండ్రి! ఎందుకో తెలుసా?

కన్న కొడుకుని దారుణంగా కొట్టి చంపిన తండ్రి! ఎందుకో తెలుసా?

తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కన్న కొడుకుని గొడ్డలితో నరికి చంపాడు. గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగాపూర్ గ్రామంలో సాయిలు-మల్లమ్మ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రమేష్ (42) అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇతగాడు తల్లిదండ్రులను తరుచు వేధింపులకు గురి చేసేవాడు. ఇంతే కాకుండా రోజూ వారితో గొడవకు దిగుతూ హింసిస్తూ ఉండేవారు. కుమారుడి వేధింపులను తండ్రి సాయిలు తట్టుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే.. శనివారం కూడా రమేష్ తండ్రి సాయిలుతో గొడవకు దిగాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.

ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన తండ్రి సాయిలు.. ఇంట్లో ఉన్న గొడ్డలితో కుమారుడు రమేష్ ను దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా ఖంగుతిని పోలీసుల దృష్టికి వెళ్లారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని తండ్రి సాయిలును అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వేధింపులను తట్టుకోలేక కుమారుడిని హత్య చేసిన తండ్రి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al