iDreamPost

Pushpa : పాన్ ఇండియా సినిమాను ఇలా వదిలేస్తారా

Pushpa : పాన్ ఇండియా సినిమాను ఇలా వదిలేస్తారా

నిన్న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఏదేదో సర్ప్రైజులు అన్నారు కానీ స్టార్ డైరెక్టర్లు తప్ప ఇంకెవరూ అతిథులుగా రాలేదు. డేట్స్ సమస్య వల్ల ఫహద్ ఫాసిల్ కూడా అటెండ్ కాలేదు. మెగా కంపౌండ్ నుంచి ఒక్కరు కూడా హాజరు కాకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అల వైకుంఠపురములో కూడా ఇలాగే గెస్టులు లేకుండా సాగినప్పటికీ అది త్రివిక్రమ్ స్టైల్. బన్నీ ఫంక్షన్లు సాధారణంగా ఆలా ఉండవు. అయితే గ్రాండియర్ కు లోటు లేకుండా వైభవంగా వేడుక నిర్వహించారు. చివరి నిమిషం పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఒత్తిడి వల్ల దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హాజరు కాలేకపోవడం ఖచ్చితంగా లోటే.

వచ్చిన వాళ్ళలో రాజమౌళి పాన్ ఇండియా ప్రమోషన్ గురించి అల్లు అర్జున్ కే నేరుగా సూచనలు కం క్లాసు తీసుకున్నారు. ఇంత మంచి ప్రోడక్ట్ చేతిలో ఉంచుకుని ఇక్కడే ఉంటే లాభం లేదని, ముంబై వెళ్లి పబ్లిసిటీ చేసుకుంటే రీచ్ పెరుగుతుందని చెప్పేశారు. ఆర్ఆర్ఆర్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు పుష్ప కోసం చాలా మంది ఎదురు చూస్తున్న విషయం అర్థమయ్యిందని, అందుకే వదిలేయకుండా ఇప్పటికైనా పరుగులు పెట్టమని అన్యాపదేశం చేశారు. చేతిలో కేవలం 4 రోజులే ఉన్న నేపథ్యంలో ఐకాన్ స్టార్ వీటిని ఎంతమేరకు పాటించే అవకాశం ఉందొ చెప్పలేం. అసలు సుక్కు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిని కలిగిస్తోంది.

తళుకులు మెరుపుల మధ్య మొత్తానికి పుష్ప ఈవెంట్ సక్సెస్ అయ్యింది. ప్రారంభంలో అభిమానుల అల్లరి కాస్త శృతి మించినా చివరికి అంతా సర్దుకుంది. హిందీ వెర్షన్ కు సంబంధించి ఇంకా ముంబై లాంటి నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. చివరి క్షణం వరకు ఇలాంటి టెన్షన్లు గట్టిగానే ఉండబోతున్నాయి. నిన్న అల్లు అర్జున్, రష్మిక మందన్నలు టీవీ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ట్రైలర్ వచ్చాక అంచనాలు రెట్టింపు కాలేదు కానీ బజ్ అయితే పాన్ ఇండియా లెవెల్ లో లేదు. మరి గురువారం వచ్చే రివ్యూలు టాకులు ఎలా ఉండబోతున్నాయో దాన్ని బట్టే బాక్సాఫీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది

Also Read : Pushpa : బన్నీ బృందానికి సవాళ్లు ఛాలెంజులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి