iDreamPost

హార్దిక్ పాండ్యా తీసుకున్న ఈ చెత్త నిర్ణయమే.. ముంబయిని ఓడించింది!

MI vs DC- Hardik Pandya: ఢిల్లీ క్యాపిటల్స్- ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 10 పరుగుల తేడాతో అనూహ్య విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబయి ఓటమికి హార్దిక్ పాండ్యా తీసుకున్న ఆ నిర్ణయమే కారణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

MI vs DC- Hardik Pandya: ఢిల్లీ క్యాపిటల్స్- ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 10 పరుగుల తేడాతో అనూహ్య విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబయి ఓటమికి హార్దిక్ పాండ్యా తీసుకున్న ఆ నిర్ణయమే కారణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

హార్దిక్ పాండ్యా తీసుకున్న ఈ చెత్త నిర్ణయమే.. ముంబయిని ఓడించింది!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో మరో రసవత్తర పోరు ముగిసింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్- ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో 10 పరుగుల తేడాతో పంత్ సేన విజయం సాధించింది. నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. అయితే వారి ప్రదర్శన కంటే కూడా హార్దిక్ పాండ్యా చేసిన తప్పుల వల్లే ఢిల్లీ జట్టు గెలిచింది అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ముందుండి ముంబయి ఇండియన్స్ జట్టును ఓడించాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వాళ్లు చేసిన వ్యాఖ్యల్లో కూడా నిజం లేకపోలేదు. హార్దిక్ పాండ్యా తీసుకున్న ఒక నిర్ణయం వల్లే ఇప్పుడు ముంబయి జట్టు ఓటమి పాలైంది.

ముంబయి జట్టు గెలిచినా.. ఓడినా హార్దిక్ పాండ్యాకి మాత్రం నిందలు తప్పడం లేదు. అతను తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటున్నాయి. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కూడా అతను తీసుకున్న నిర్ణయాల ఢిల్లీ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఎవరైతే ఎక్కువ పరుగులు ఇస్తున్నారో.. వారికే హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఇస్తూ ఉండటం గమనార్హం. ఎవరైతే కంట్రోల్డ్ బౌలింగ్ చేస్తున్నారో వారిని మాత్రం పక్కన పెట్టేసి వారికి మళ్లీ అవకాశం ఇవ్వట్లేదు. గత మ్యాచుల్లో కూడా ఇలాంటి సీన్స్ జరిగాయి. కానీ, ఓటముల నుంచి హార్దిక్ పాండ్యా పాఠాలు నేర్చుకుంటున్నట్లు మాత్రం కనిపించడం లేదు. పదే పదే అదే తరహా తప్పులు చేస్తున్నాడు.

Hardik pandya

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి జట్టు.. ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయడంలో చేతులెత్తేసింది. ప్రతి బౌలర్ ను ఢిల్లీ బ్యాటర్లు ఆడేసుకున్నారు. బుమ్రా మరోసారి తన బౌలింగ్ నైపుణ్యంతో తన వంతు ప్రయత్నం తాను చేశాడు. హార్దిక్ పాండ్యా వేసిన 2 ఓవర్లకే 41 పరుగులు ఇచ్చేశాడు. ఇంక నబీ మాత్రం చాలా కంట్రోల్ గా బౌలింగ్ చేశాడు. వేసిన 2 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. కానీ, ఆ తర్వాత మళ్లీ నబీకి బౌలింగ్ ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే ల్యూక్ ఉడ్ అందరికంటే అత్యధికంగా 68 పరుగులు ఇచ్చాడు. అన్ని పరుగులు లీక్ చేస్తున్నా అతనితో 4 ఓవర్లు బౌలింగ్ చేయించాడు.

మరోవైపు తుషారా కూడా 56 పరుగులు ఇచ్చాడు. అతను కూడా 4 ఓవర్లు బౌలింగ్ వేశాడు. ఢిల్లీ జట్టు కేవలం 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే గనుక నబీ ఇంకో 2 ఓవర్లు బౌలింగ్ చేసి.. మరో వికెట్ తీసుకుని కాస్త తక్కువ పరుగులు ఇచ్చి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది అంటూ ముంబయి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హార్దిక్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేశారు. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్స్ టేబుల్లో 5వ స్థానికి చేరుకుంది. మరి.. ముంబయి ఓటమి వెనుక హార్దిక్ పాండ్యా నిర్ణయాలు ఉన్నాయా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి