iDreamPost

కీరవాణికి గోల్డెన్ గ్లోబ్ – శభాష్ రాజమౌళి

లాస్ ఏంజిల్స్ లో ఐమాక్స్ ప్రీమియర్ తో మొదలుపెట్టి అక్కడి మీడియాకు అభిమానులకు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న జక్కన్న బృందం కోరుకున్నట్టే గొప్ప ఘనతను అందుకుంది.

లాస్ ఏంజిల్స్ లో ఐమాక్స్ ప్రీమియర్ తో మొదలుపెట్టి అక్కడి మీడియాకు అభిమానులకు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న జక్కన్న బృందం కోరుకున్నట్టే గొప్ప ఘనతను అందుకుంది.

కీరవాణికి గోల్డెన్ గ్లోబ్ – శభాష్ రాజమౌళి

అంతర్జాతీయ ఫిలిం మేకర్స్ ఆస్కార్ తర్వాత గొప్ప పురస్కారంగా భావించే గోల్డెన్ గ్లోబ్ ని ఎంఎం కీరవాణి అందుకున్నారు. యుఎస్ లో ఎందరో మహామహుల మధ్య జరిగిన వేడుకలో రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు వీళ్లందరి కుటుంబ సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య తెలుగు వాడి కీర్తిపతాకాన్ని అమెరికా వీధుల్లో ఎగరేశారు. లాస్ ఏంజిల్స్ లో ఐమాక్స్ ప్రీమియర్ తో మొదలుపెట్టి అక్కడి మీడియాకు అభిమానులకు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న జక్కన్న బృందం కోరుకున్నట్టే గొప్ప ఘనతను అందుకుంది. టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి ఈ గౌరవం దక్కించుకున్న సంగీత దర్శకుడిగా కీరవాణి నిలిచిపోయారు

నాటు నాటు దేశాల పరిధిని దాటి చాలా దూరం వెళ్ళింది. జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, యుకె, న్యూజిలాండ్, దుబాయ్ తదితర దేశాల్లో ప్రతి ఒక్కరిని డాన్స్ తో ఊపేసిన ఈ సాంగ్ కి ప్రేమ్ రక్షిత్ సమకూర్చిన కొరియోగ్రఫీ దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. చక్కని పల్లెకట్టు పదాలతో చంద్రబోస్ సమకూర్చిన సాహిత్యం అంతే గొప్పగా పండింది. చరణ్ తారక్ లయ తప్పకుండ వేగంగా వేసిన స్టెప్పులకు ఇండియాలో థియేటర్లే కాదు విదేశాల్లో కూడా ఫారినర్స్ ఆనందంతో గెంతులు వేశారు. ఒక తెలుగు పాట ఇంటర్నేషనల్ లెవెల్ లో రీచ్ తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. బాహుబలిని మించి ఆర్ఆర్ఆర్ విజయం సాధించిందని చెప్పడానికి ఇదే నిదర్శనం

సోషల్ మీడియా మొత్తం ఈ గోల్డెన్ గ్లొబ్ వార్తతో ఊగిపోతోంది. ఒకపక్క సంక్రాంతి సినిమాల సందడి మొదలవుతున్న టైంలోనే ఈ శుభవార్త వినిపించడం విశేషం. జక్కన్న తర్వాత టార్గెట్ ఆస్కార్. విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఇతర విభాగాల సంగతేమో కానీ నాటు నాటుకి ఆస్కార్ వస్తే మాత్రం స్టేజి మీద లైవ్ ఇప్పించే ప్రయత్నం చేస్తానన్న మాట ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ ని పెంచుతోంది. అది కాకపోయినా కనీసం ఒకటి రెండు విభాగాల్లో గెలవాలనేది ఆర్ఆర్ఆర్ లక్ష్యం. నామినేషన్లలో రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్, కాంతార, ది కాశ్మీర్ ఫైల్స్ తోడవ్వడం మరో విశేషం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి