iDreamPost

మహేశ్ తో మూవీపై రాజమౌళి కామెంట్స్.. షూటింగ్ ఎప్పుడంటే?

Rajamouli Update On SSMB 29: మహేశ్ బాబు- రాజమౌళి కాంబో ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశాడు.

Rajamouli Update On SSMB 29: మహేశ్ బాబు- రాజమౌళి కాంబో ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశాడు.

మహేశ్ తో మూవీపై రాజమౌళి కామెంట్స్.. షూటింగ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఉన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లో కచ్చితంగా మహేశ్ బాబు- రాజమౌళి ప్రాజెక్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో రాజమౌళి తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కథ కూడా వరల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఎంచుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రీ పొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి రాజమౌళి స్పందించాడు. అలాగే షూటింగ్ కి సంబంధించి కూడా కామెంట్స్ చేశాడు.

మహేశ్ బాబు 29వ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మూవీతో మహేశ్ బాబు ఏకంగా పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై ఎన్నో అంచనాలు, మరెన్నో గాసిప్స్ ఉన్నాయి. ఈ మూవీలో హాలీవుడ్ యాక్టర్స్ ఉండబోతున్నారని, ఈ మూవీలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజిబెత్ ఇస్లాన్ నటిస్తోందని చెప్పుకొచ్చారు. ఇంక కథ విషయానికి వస్తే.. ఆఫ్రికా అడవుల్లో జరిగే అడ్వెంచర్ స్టోరీ అని ఇప్పటికే పలు సందర్భాల్లో స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ప్రస్తావించారు. క్యారెక్టర్ కూడా మహేశ్ బాబు ఇంటెన్సిటీ లెవల్ యాక్టింగ్ కు యాప్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇంతటి హైప్ క్రియేట్ అవుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి గాసిప్స్, పుకార్లు కాకుండా నేరుగా జక్కన్నే స్పందించాడు. బళ్లారిలోని అమృతేశ్వర ఆలయ ప్రారంభోత్సవానికి రాజమౌళి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆ తర్వాత అక్కడున్న రాజకీయ నేతలతో సమావేశం అయ్యారు. ఆ సందరభంలోనే మహేశ్ తో ప్రాజెక్టుకు సంబంధించి కామెంట్స్ చేశారు. “మహేశ్ బాబుతో సినిమా తీస్తున్నాను. త్వరలోనే ఆ మూవీకి సంబంధించి షూటింగ్ ప్రారంభించబోతున్నాం. ఆ మూవీకి సంబంధించి ఇంకా టైటిల్ ని ఖరారు చేయలేదు” అంటూ రాజమౌళి రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఈ వార్త విన్న తర్వాత మహేశ్ బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకాలం మహేశ్- రాజమౌళి ప్రాజెక్టుకు సంబంధించి షూటింగ్ ఎప్పుడు అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.

ఇప్పుడు స్వయంగా రాజమౌళి రియాక్ట్ అవ్వడంతో సినిమా షూట్ కి సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చినట్లు అయ్యింది. అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించి ఇన్నాళ్లు కొన్ని టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. “మహారాజ్” అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ చెప్పుకొచ్చారు. కానీ, అలాంటిది ఏమీ లేదని క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. ఇంక ఈ మూవీ కోసం మహేశ్ బాబు ఏకంగా మూడేళ్ల పాటు డేట్స్ లాక్ చేసేందుకు ఫిక్స్ అయిపోయాడు. గుంటూరు కారం తర్వాత మళ్లీ మహేశ్ బాబు సినిమా థియేటర్లో చూడాలి అంటే మహేశ్ ఫ్యాన్స్ కనీసం ఇంకో మూడేళ్లు వెయిట్ చేయక తప్పదు. కానీ, ఆ వెయిటింగ్ జీవితకాలం గుర్తుండిపోయే చిత్రాన్ని అయితే జక్కన్న అందిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ఉండబోతోంది కాబట్టి.. ఆ ఎదురుచూపులకు తగ్గ ఫలితం అయితే ఉంటుంది. మరి.. మహేశ్- రాజమౌళి ప్రాజెక్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి