iDreamPost

హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ను కొనసాగించడంపై గంభీర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

  • Author singhj Published - 04:13 PM, Wed - 29 November 23

టీమిండియా హెడ్ కోచ్​గా రాహుల్ ద్రవిడ్​ను కొనసాగిస్తూ బీసీసీఐ డెసిషన్ తీసుకుంది. ఈ విషయంపై సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

టీమిండియా హెడ్ కోచ్​గా రాహుల్ ద్రవిడ్​ను కొనసాగిస్తూ బీసీసీఐ డెసిషన్ తీసుకుంది. ఈ విషయంపై సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  • Author singhj Published - 04:13 PM, Wed - 29 November 23
హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ను కొనసాగించడంపై గంభీర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

వన్డే వరల్డ్ కప్-2023 ముగిసినప్పటి నుంచి భారత క్రికెట్​లో ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన అంశాలు రెండు. అందులో ఒకటి సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ రిటైర్మెంట్. ఇంకొకటి హెడ్ కోచ్​ రాహుల్ ద్రవిడ్ ఫ్యూచర్. కోహ్లీ-హిట్​మ్యాన్ టీ20ల్లో కంటిన్యూ అవుతారా? వన్డేలు, టెస్టులకే పరిమితం అవుతారా? లేదా రిటైర్మెంట్ తీసుకుంటారా? అంటూ పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది. అదే టైమ్​లో కోచ్ ద్రవిడ్ కాంట్రాక్ట్​ ముగిసిపోవడంతో ఆయన్ను కంటిన్యూ చేస్తారా? రాహుల్ ప్లేస్​లో వీవీఎస్ లక్ష్మణ్ లేదా వేరొకర్ని ఆ పోస్టుకు రీప్లేస్ చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఎట్టకేలకు వీటిపై భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) క్లారిటీ ఇచ్చింది.

కొన్నాళ్లుగా ఎంతో ఉత్కంఠ రేపిన టీమిండియా హెడ్ కోచ్ పదవిపై స్పష్టత వచ్చేసింది. ప్రధాన కోచ్​గా కంటిన్యూ అయ్యేందుకు రాహుల్ ద్రవిడ్ అంగీకరించాడు. దీన్ని బీసీసీఐ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది. ద్రవిడ్​తో పాటు ఇప్పటికే ఉన్న సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని కూడా బోర్డు పొడిగించింది. దీంతో బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్​కు ఎక్స్​టెన్షన్ లభించినట్లయింది. అయితే వీళ్లంతా ఎప్పటిదాకా ఆ పదవిలో ఉంటారనేది మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్​, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్నాయి.

ఇక, కోచ్​గా కంటిన్యూ అయ్యేందుకు మొదట ఇంట్రెస్ట్ చూపని ద్రవిడ్.. ఆఖరికి అంగీకరించాడు. దీనిపై ఆయన స్పందిస్తూ.. గత రెండేళ్లుగా భారత టీమ్​తో ప్రయాణం ఎన్నో జ్ఞాపకాలను అందించిందన్నారు. ఎన్నో ఎత్తుపల్లాలను చూశామని.. మేనేజ్​మెంట్​తో పాటు టీమ్ నుంచి ఎంతో సపోర్ట్ దొరికిందన్నాడు. టీమిండియాలో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారని.. తామంతా సరైన దారిలోనే ఉన్నామన్నారు. తన మీద నమ్మకం ఉంచి ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపాడు. వన్డే వరల్డ్ కప్​కు ముందు టీమ్​గా చాలా ఛాలెంజెస్​ను ఎదుర్కొన్నామని.. వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డామని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. జట్టు కోసం పలుమార్లు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చేదన్నాడు.

కుటుంబ సభ్యుల మద్దతును మర్చిపోలేనని.. తన కోసం వాళ్లు చాలా త్యాగాలు చేశారని చెబుతూ ద్రవిడ్ ఎమోషనల్ అయ్యాడు. హెడ్​ కోచ్​గా ద్రవిడ్​ను కంటిన్యూ చేయడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మంచి టీమ్​ను సెట్ చేశారని.. వన్డే వరల్డ్ కప్ మిస్సయినా టీ20ల్లో కప్పు కొడతామని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ద్రవిడ్ కాంట్రాక్ట్ కొనసాగింపుపై టీమిండియా మాజీ ప్లేయర్ గౌతం గంభీర్ రియాక్ట్ అయ్యాడు. ‘ద్రవిడ్​ను కొనసాగించాలనేది మంచి నిర్ణయం. త్వరలో టీ20 వరల్డ్ కప్ ఉన్నందున సపోర్ట్​ స్టాఫ్​ను మార్చలేం. హెడ్​ కోచ్​గా కంటిన్యూ అయ్యేందుకు రాహుల్ ఒప్పుకోవడం మంచి విషయం. మనం ఇదే తరహాలో డామినేట్ చేస్తూ ఆడతామని ఆశిస్తున్నా’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. మరి.. ద్రవిడ్ కొనసాగింపుపై గౌతీ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నితిన్​కు ధోని సర్​ప్రైజ్ గిఫ్ట్! ఏం ఇచ్చాడంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి