iDreamPost
android-app
ios-app

సూర్యపై మాకు నమ్మకం ఉంది! అతన్ని ఇంకా సపోర్ట్‌ ఇస్తాం: ద్రవిడ్‌

  • Published Sep 21, 2023 | 6:39 PM Updated Updated Sep 21, 2023 | 6:39 PM
  • Published Sep 21, 2023 | 6:39 PMUpdated Sep 21, 2023 | 6:39 PM
సూర్యపై మాకు నమ్మకం ఉంది! అతన్ని ఇంకా సపోర్ట్‌ ఇస్తాం: ద్రవిడ్‌

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రేపటి(శుక్రవారం) నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాలకు తొలి రెండు వన్డేలకు రెస్ట్‌ ఇచ్చారు. కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలు ఆడనుంది. అయితే.. ఆసీస్‌తో సిరీస్‌కు టీమ్‌ ప్రకటించే కంటే ముందే త్వరలో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్‌ కప్‌ కోసం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆ టీమ్‌లో కొంతమంది ఆటగాళ్ల ఎంపికపై విమర్శలు వచ్చాయి.

ముఖ్యంగా మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను వరల్డ్‌ కప్‌ కోసం ఎలా ఎంపిక చేశారంటూ చాలా మంది క్రికెట్‌ అభిమానులు సెలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ20 ఫార్మాట్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌గా ఉన్న సూర్య.. వన్డేల్లో మాత్రం రాణించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 27 వన్డేలు ఆడిన సూర్య 25 ఇన్నింగ్స్‌లలో 24.41 సగటుతో 538 పరగులు మాత్రమే చేశాడు. పైగా స్ట్రైక్‌రేట్‌ కూడా చాలా పెద్దగా లేదు. కేవలం 99.81 మాత్రమే. ముఖ్యంగా ఇక్కడ సగటు గురించి మాట్లాడుకోవాలి.. 24.41.

ఇదే సమయంలో వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కని సంజూ శాంసన్‌ యావరేజ్‌ అద్భుతంగా ఉండటంతో అతన్ని ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం సూర్యకుమార్‌ యాదవ్‌నే వెనకేసుకొచ్చింది. తాజాగా టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం సూర్యకుమార్‌ యాదవ్‌ను మరింత బ్యాక్‌ చేస్తామంటూ మరోసారి గట్టిగా చెప్పాడు. వన్డేల్లో కూడా సూర్య రాణిస్తాడనే నమ్మకం ఉందని అన్నాడు. వరల్డ్‌ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు వన్డేల్లో అతనికి మంచి గేమ్‌ టైమ్‌ దొరుకుతుందని పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో నెట్‌ బౌలర్‌గా ఫుడ్‌ డెలవరీ బాయ్‌! సక్సెస్‌ స్టోరీ