iDreamPost

YS Jagan: CM జగన్ కృషితో.. వైజాగ్ లోని 7.2 ఎకరాల్లో మెగా ఐటీ పార్క్!

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

YS Jagan: CM జగన్ కృషితో.. వైజాగ్ లోని 7.2 ఎకరాల్లో మెగా ఐటీ పార్క్!

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. సంక్షేమం, అభివృద్ధి రెండిటిని జోడెద్దుల పరుగులు పెట్టించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రాయలసీమ మొదలు ఉత్తరాంధ్ర వరకు వెలుగొండ, హంద్రీనివా, బందర్ పోర్టు, కాకినాడ గేట్ వే పోర్టు, భోగాపురం, ఉద్దానం కిడ్నీ ఆస్పత్రి..ఇలా ఎన్నో అభివృద్ధి  సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ చేపట్టారు. అలానే ఉత్తరాంధ్ర వాసులకు మరో ప్రతిష్టాత్మక సంస్థను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. విశాఖ అభివృద్ధికి దోహదపడేలా రహేజ్ గ్రూప్ ఐటీ పార్క్ ను విశాఖలో కంపెనీ వైజాగ్ రానుంది. ఈ మేరకు రహేజ్ గ్రూప్ విశాఖపట్నంలో ఐటీ పార్క్ ఏర్పాటు జరుగుతోంది.

ఏపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక అభివృద్ధి నిర్మాణాలను సీఎం జగన్ సర్కార్  చేపట్టింది. అలానే ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త చెబుతూ.. విశాఖ అభివృద్ధికి దోహదపడేలా రహేజ్ గ్రూప్ ఐటీ పార్క్ ఏర్పాటు జరుగుతోంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే భూమిని కేటాయించింది. రుషికొండలోని ఐటీ సెజ్‌లో 7.24 ఎకరాల స్థలాన్ని రహేజా గ్రూప్‌నకు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలాన్ని 33 ఏళ్లపాటు రహేజా గ్రూప్‌కు లీజుకు ఇస్తూ ఏపీ సర్కార్ గతేడాది నవంబర్ 14వ తేదీన ఉత్తర్వూలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐటీపార్కులో ఐటీ టవర్స్, ఇంక్యుబేషన్ స్పేస్, సపోర్ట్ సర్వీసులు, హెల్త్ క్లబ్, రెస్టారెంట్లు రహేజా గ్రూప్ ఏర్పాటు చేసే ఐటీ  పార్క్ లో ఉండనున్నాయి.

నిజానికి గతంలోనే రహేజా గ్రూప్ ఐటీ సెజ్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే వివిధ కారణాలతో ఆ ఆలోచన వాస్తవ రూపం దాల్చలేదు. ఐటీ సెజ్ ఏర్పాటు కోసం రహేజా గ్రూప్ మరోసారి ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు తెలిసింది. దీంతో రుషికొండలో7.24 ఎకరాల భూమిని ఏపీఐఐసీ, రహేజా గ్రూపునకు కేటాయించింది. ఐటీ పార్క్ ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు పరోక్షంగా చాలా మందికి ఉపాధి దొరుకుతుందని అంటున్నారు.

అలానే రహేజ్ గ్రూ ప్ విశాఖలోనే ఇనార్బిట్ మాల్ ను నిర్మిస్తోంది. గతంలో దీనికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. వైజాగ్ లోని కైలాసపురం ప్రాంతంలో రూ.600 కోట్ల పెట్టుబడులతో ఈ నిర్మాణం జరుగుతోంది. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో దక్షిణాదిలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్‌గా ఏర్పాటు కానుంది. ఇనార్బిట్ మాల్ నిర్మాణం ద్వారా సుమారు 8 వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. మొత్తంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అందుకు నిదర్శనమే ఈ అభివృద్ధి కార్యక్రమాలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి