iDreamPost

‘పుష్ప 2’ నుంచి ఫాహద్ ఫాజిల్ లుక్ రిలీజ్.. షెకావత్ గుండు మీద ఆ దెబ్బేంటి?

  • Author singhj Published - 01:20 PM, Tue - 8 August 23
  • Author singhj Published - 01:20 PM, Tue - 8 August 23
‘పుష్ప 2’ నుంచి ఫాహద్ ఫాజిల్ లుక్ రిలీజ్.. షెకావత్ గుండు మీద ఆ దెబ్బేంటి?

ఫాహద్ ఫాజిల్.. మన దేశంలోని అతికొద్ది మంది విలక్షణమైన నటుల్లో ఒకరు. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుల లిస్టు తీస్తే అందులో టాప్​-3లో ఆయన పక్కా ఉంటారు. తనకు ఇచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి సహజసిద్ధమైన నటనతో ఆయన పలికించే హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అంత అందగాడు కాదు, ఆజానుబాహుడూ కాదు.. అయినా కేవలం యాక్టింగ్ టాలెంట్​తోనే సిల్వర్​ స్క్రీన్​ను షేక్ చేస్తున్నారు ఫాహద్. మలయాళంలో డిఫరెంట్ ఫిల్మ్స్​తో ఎన్నో హిట్స్ కొట్టిన ఆయన ఇప్పుడు మిగిలిన చిత్రసీమల పైనా ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ ‘పుష్ప’తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’, ఉధయనిధి స్టాలిన్ ‘మామన్నన్​’లో నటించారు ఫాహద్.

‘పుష్ప’ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో కనిపించింది కాసేపే అయినా ఫుల్ ఇంపాక్ట్ చూపించారు ఫాహద్ ఫాజిల్. సెకండ్ పార్ట్​లో పుష్ప, షెకావత్​కు మధ్య వచ్చే ప్రతీకార సన్నివేశాలే హైలైట్​గా ఉండబోతున్నాయని టాక్. అయితే తాజాగా ఫాహద్ పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప 2’ నుంచి ఆయన లుక్​ను రిలీజ్ చేశారు. ఇందులో ఫాహద్ లుక్​పై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. ఆ లుక్​ను గమనిస్తే.. ఆయన గుండుపై ఓ గీత ఉంది. షెకావత్​కు ఏదో దెబ్బ తగిలినట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి పుష్ప, షెకావత్​ల మధ్య పెద్ద గొడవే జరిగి ఉండాలని, ఆ ఫైట్​లోనే ఈ గాటు ఏర్పడిందని నెటిజన్స్ అంటున్నారు.

కొత్త పోస్టర్​లో ఫాహద్ ఫాజిల్ ఒంటి మీద చొక్కా కూడా లేదు. పుష్పపై రివేంజ్ తీసుకునే క్రమంలో అతడు తన డ్యూటీకి కూడా గుడ్ బై చెబుతాడా? సీక్వెల్​లో పోలీసు ఆఫీసర్​లా కాకుండా రౌడీలా షెకావత్ కనిపిస్తాడా? అని ఇంకొందరు నెటిజన్స్ సందేహాలు వెలిబుచ్చుతున్నారు. మొత్తానికి ఒకే ఒక్క పోస్టర్​తో అంచనాలు పెంచేయడమే గాక మరెన్నో ప్రిడిక్షన్స్​కు డైరెక్టర్ సుకుమార్ హింట్ ఇచ్చారనే చెప్పాలి. ఇకపోతే, ‘పుష్ప 3’ కూడా ఉంటుందని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సుక్కూ ఇప్పటికే స్క్రిప్ట్​ను సిద్ధం చేశారని టాక్. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది మేకర్స్​కే తెలియాలి. మరి.. ‘పుష్ప 2’ నుంచి విడుదలైన ఫాహద్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి