iDreamPost
android-app
ios-app

అధికారితోనే పంట పొలాల వ్యర్థాలను తగులబెట్టించిన రైతులు.. వీడియో వైరల్

పంటలు పూర్తైన తర్వాత పంట వ్యర్థాలను తగులబెడుతున్నారు రైతులు. దీంతో తీవ్ర వాయుకాలుష్యం కలుగుతోంది. దేశంలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం ఎక్కువైపోయింది.

పంటలు పూర్తైన తర్వాత పంట వ్యర్థాలను తగులబెడుతున్నారు రైతులు. దీంతో తీవ్ర వాయుకాలుష్యం కలుగుతోంది. దేశంలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం ఎక్కువైపోయింది.

అధికారితోనే పంట పొలాల వ్యర్థాలను తగులబెట్టించిన రైతులు.. వీడియో వైరల్

నేటి కాలంలో ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య కాలుష్యం. తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు ఇలా ప్రతి ఒక్కటి కాలుష్యానికి గురవుతున్నాయి. కాలుష్యం కారణంగా ప్రతీఏటా ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. కాలుష్య నివారణకు ప్రభుత్వాలు పలు రకాల చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత ప్రమాద స్థాయికి చేరింది. అక్కడి ప్రజలు ఊపిరాడక విలవిల్లాడిపోతున్నారు. కాలుష్య నివారణకు బాణాసంచా పేల్చొద్దని, ఇటుక బట్టీలు కాల్చకూడదని, పంట పొలాల వ్యర్థాలను తగుల బెట్టకూడదని ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కొందరు రైతులు ప్రభుత్వ సూచనలను పట్టించుకోకుండా వరి కొయ్యలను తగులబెడుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ లో పంట వ్యర్థాలకు నిప్పు పెడుతున్న రైతులను అడ్డుకోబోయిన అధికారిచేతనే ఆ వ్యర్థాలను తగులబెట్టించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

పంటలు పూర్తైన తర్వాత పంట వ్యర్థాలను తగులబెడుతున్నారు రైతులు. దీంతో తీవ్ర వాయుకాలుష్యం కలుగుతోంది. దేశంలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం ఎక్కువైపోయింది. అక్కడి రైతులు పండించిన పంట ఇంటికి చేరగానే పంట వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. దీంతో ఆ ప్రాంతంతో పాటు ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుని వాయుకాలుష్యానికి కారణమవుతోంది. ప్రజలు ఊపిరిపీల్చుకోలేని స్థితిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయుకాలుష్యం భారిన పడి శ్వాస సంబంధిత రోగాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది.

వరికొయ్యలు తగులబెట్టకుండా రైతులకు అవగాహన కల్పిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపట్ల చర్యలు తీసుకుంటుంది. అయితే తాజాగా పంజాబ్ లో కొందరు రైతులు వరికొయ్యలను తగులబెట్టేందుకు సిద్ధమవుతుండగా అధికారి అడ్డుకున్నాడు. దీంతో ఆయనపై తిరగబడ్డారు. చివరకు ఆ అధికారితోనే వరికొయ్యలకు నిప్పు పెట్టించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బఠిండాలోని మొహమా సర్జా గ్రామంలో కొందరు రైతులు తమ పంట వ్యర్థాలకు నిప్పు పెడుతుండగా హర్‌ప్రీత్‌ సింగ్‌ అనే అధికారి వారి వద్దకు వెళ్లి అడ్డుకున్నాడు. దాంతో రైతులు అధికారిపై తిరగబడ్డారు. ఇదే సమయంలో రైతు సంఘాల నేతలు సైతం అక్కడికి చేరుకుని వాగ్వాదానికి దిగారు.

చివరాఖరికి సదరు అధికారి చేతనే కొయ్యకాలుకు నిప్పుపెట్టించారు. పంట వ్యర్థాలను తగులబెట్టవద్దని అడ్డుకునేందుకు వచ్చిన అధికారితోనే రైతులు బలవంతంగా పంట వ్యర్థాలను తగులబెట్టించడం సంచలనంగా మారింది. రైతులయ్యుండి ఈ విధంగా ప్రవర్తించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవగా పోలీస్ అధికారుల వద్దకు చేరింది. ప్రభుత్వాధికారిపై తిరగబడిన ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు డీజిల్ తో నడిచే వాహనాలను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి