iDreamPost

Punarnavi Bhupalam: పునర్నవి ఫోజులు? వారిని టార్గెట్ చేస్తూ కొత్త చర్చ!

  • Author Soma Sekhar Updated - 03:30 PM, Thu - 30 November 23

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అర్దనగ్నంగా ఆమె ఇచ్చిన ఫోజు వైరల్ గా మారింది.

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అర్దనగ్నంగా ఆమె ఇచ్చిన ఫోజు వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Updated - 03:30 PM, Thu - 30 November 23
Punarnavi Bhupalam: పునర్నవి ఫోజులు? వారిని టార్గెట్ చేస్తూ కొత్త చర్చ!

పునర్నవి భూపాలం.. చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ గుర్తింపుతోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. ఇది ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఈ రియాలిటీ షో ద్వారా పునర్నవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గరైంది. ఇక హౌస్ లో రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన హంగామా మనందరికి తెలిసిందే. ఇక ఈ షోతో ఆమెకు విపరీమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దీంతో హౌస్ నుంచి వచ్చిన తర్వాత అవకాశాలు వచ్చిపడతాయని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ క్రేజ్ ను పునర్నవి ఎప్పుడూ వాడుకోవాలని చూడలేదు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఉన్నట్లుండి అర్దనగ్న ఫొటో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్య పరిచింది.

పునర్నవి భూపాలం.. పిట్ట గోడ, ఉయ్యాలా జంపాలా, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక బిగ్ బాస్ తర్వాత ఆమె క్రేజ్ మరింతగా పెరగడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిని ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది. రియాలిటీ షో నుంచి బయటకు వచ్చాక ఉన్నత చదువుల కోసం ఆమె విదేశాలకు వెళ్లింది. పునర్నవి సైకాలజీలో పీజీ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఆమె విదేశాల్లో చదువుతూ తన స్నేహితులతో ఎంత రచ్చ చేస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఇటీవల తనపై పిచ్చిపిచ్చి వార్తులు రాసిన వారిపై మండిపడింది. ఇక ఇలాంటి వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. అర్దనగ్న ఫొటోలను షేర్ చేసి కొత్త చర్చకు దారితీసింది.

గతంలో తనపై వార్తలు రాసిన వారిని టార్గెట్ చేస్తూ పునర్నవి ఈ పిక్ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది పునర్నవి. “సోషల్ మీడియా నన్ను ప్రలోభపెట్టదు. ఇలాంటి పనులన్నీ క్రూరమైన ఉద్దేశాలు లేని నిజమైన వ్యక్తులే చేస్తారు” అని తన స్టైల్లో అర్ధం కాని రీతిలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. తనపై తప్పుడు వార్తలు రాసిన వారిని టార్గెట్ గా చేసుకుని పునర్నవి ఈ పిక్ పెట్టి వారికి గట్టిగా సమాధానం ఇచ్చిందని మరికొందరు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. కాగా.. చదువు పూర్తైయ్యాక మళ్లీ తెరపై కనిపిస్తుందా? లేదా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరి పునర్నవి పోస్ట్ చేసిన ఈ ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి