iDreamPost

సెంట్రల్ కాంట్రాక్ట్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్ బాటలో స్టార్ క్రికెటర్లు! ఆ ఐదుగురు ఎవరు?

బీసీసీఐ తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రక్ట్ నేపథ్యంలో ఓ ఐదుగురు టీమిండియా సీనియర్ ప్లేయర్లు తమ కెరీర్ కు వీడ్కోలు పలుకుతారన్న న్యూస్ వైరల్ గా మారింది. మరి ఆ ప్లేయర్లు ఎవరు? ఆ వివరాలు తెలుసుకుందాం.

బీసీసీఐ తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రక్ట్ నేపథ్యంలో ఓ ఐదుగురు టీమిండియా సీనియర్ ప్లేయర్లు తమ కెరీర్ కు వీడ్కోలు పలుకుతారన్న న్యూస్ వైరల్ గా మారింది. మరి ఆ ప్లేయర్లు ఎవరు? ఆ వివరాలు తెలుసుకుందాం.

సెంట్రల్ కాంట్రాక్ట్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్ బాటలో స్టార్ క్రికెటర్లు! ఆ ఐదుగురు ఎవరు?

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. తాజాగా విడుదల చేసిన ఈ కాంట్రాక్ట్ లిస్ట్ లో తొలిసారి 11 మంది యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. అందులో రింకూ సింగ్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి యంగ్ ప్లేయర్లు ఉన్నారు. అయితే షాకింగ్ విషయం ఏంటంటే? శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. వీరితో పాటుగా కొందరు సీనియర్లకు కూడా ఇందులో చోటు దక్కలేదు. దీంతో వారు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లేయర్లు ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రస్తుతం చర్చంతా బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ గురించే. 11 మంది యువ ఆటగాళ్లకు ఇందులో చోటు కల్పించిన బీసీసీఐ.. కొందరికి మాత్రం ఊహించని షాకిచ్చింది. అందులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లు ఉన్నారు. వీరి ప్రవర్తన కారణంగా బీసీసీఐ కొరఢాఝుళిపించింది. వీరితో పాటుగా మరికొందరు సీనియర్లకు కాంట్రాక్ట్ లో మెుండిచేయి చూపించింది మేనేజ్ మెంట్. గత కొంత కాలంగా ఓ ఐదుగురు ప్లేయర్లు జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పూర్ ఫామ్ తో సతమతమవుతున్న వారిని పక్కనపెట్టింది. ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎవరంటే?

1. చతేశ్వర్ పుజారా

2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత పుజారా టీమిండియాలో కనిపించనేలేదు. అయితే ఆ తర్వాత ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ తో పాటుగా తాజాగా జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024లో అద్భుత ప్రదర్శనలు చేశాడు. కానీ ఈ నయావాల్ ను మాత్రం జట్టులోకి తీసుకోలేదు. పైగా ఇప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పించారు. దీంతో పుజారా కెరీర్ ముగిసిందా? అన్న అనుమానులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అతడు రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యం లేదంటున్నారు క్రీడా నిపుణులు.

2. శిఖర్ దావన్

టీమిండియా వెటరన్ ఓపెనర్ గా జట్టుకు ఎన్నో విజయాను అందించాడు. కానీ గత కొంత కాలంగా ఫ్యామిలీ సమస్యలతో, పూర్ ఫామ్ తో టీమ్ కు దూరం కావాల్సి వచ్చింది. చివరగా దావన్ 2022 డిసెంబర్ లో టీమిండియాకు ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో ఇతడిని సైతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి మినహాయించింది. ప్రస్తుతం డీవై పాటిల్ టీ20 కప్ 2024లో డీవై పాటిల్ బ్లూ జట్టుకు ఆడుతున్నాడు. అయినప్పటికీ.. అతడు తిరిగి టీమిండియాలోకి రాగలడా? అన్న అనుమానాలు ఉన్నాయి.

3. అజింక్యా రహానే

గతేడాది ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన అజింక్యా రహానే.. తిరిగి టీమిండియాలోకి వచ్చాడు. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడాడు. అనంతరం విండీస్ పర్యటనకు వైస్ కెప్టెన్ గా కూడా ఎంపికైయ్యాడు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా జట్టుకు దూరమైయ్యాడు. ఇక ఇప్పుడు ఏకంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచే తప్పించారు. ఇది రహానే కెరీర్ కు ముగింపేనా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

4. ఉమేష్ యాదవ్

వీరితో పాటుగా చాలా కాలంగా టీమిండియాలో చోటు కోసం పోరాడుతున్నాడు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్. తాజాగా బీసీసీఐ విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఇతడికి కూడా చోటు దక్కలేదు. దీంతో ఇప్పుడు అతడి పునరాగమనంపై సందేహాలు నెలకొన్నాయి. కొన్ని రోజులు వెయిట్ చేస్తాడా? లేక రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అంటూ చర్చ మెుదలైంది.

5. ఇషాంత్ శర్మ

సెంట్రల్ కాంట్రాక్ట్ ను కోల్పోయిన మరో వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. పైవారి కంటే ఎక్కువ కాలంగా భారత జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ అతడి ప్రదర్శన కారణంగా టీమ్ లోకి రావడం కష్టంగానే అనిపిస్తోంది. పైగా అతడు చాలా కాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. దీంతో ఈ ఐదుగురిలో మెుదట రిటైర్మెంట్ ప్రకటించే వారిలో ఇతడే ముందువరుసలో ఉన్నాడని క్రీడా నిపుణులు చెప్పుకొస్తున్నారు. మరి నిజంగానే ఈ ఐదుగురు ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన.. ఒకే మ్యాచ్ లో ఓపెనర్లుగా మామ, అల్లుడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి