iDreamPost

Priyamani: ప్రియమణి పారితోషికం అంత తక్కువా? ఖర్చు పెట్టలేక ఏమి చేసిందంటే?

  • Published Apr 13, 2024 | 1:33 PMUpdated Apr 13, 2024 | 1:33 PM

ప్రముఖ సినీ నటి ప్రియమణి గురించి తెలుగు వారికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అయితే, ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు మాత్రం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆ వివరాలేంటో చూసేద్దాం.

ప్రముఖ సినీ నటి ప్రియమణి గురించి తెలుగు వారికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అయితే, ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు మాత్రం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆ వివరాలేంటో చూసేద్దాం.

  • Published Apr 13, 2024 | 1:33 PMUpdated Apr 13, 2024 | 1:33 PM
Priyamani: ప్రియమణి పారితోషికం అంత  తక్కువా? ఖర్చు పెట్టలేక ఏమి చేసిందంటే?

తెలుగునాట తన సత్తా చూపించి.. అటు బి టౌన్ లో కూడా మంచి ఫేమ్ సంపాదించుకుంటున్న నటి ప్రియమణి. 2003 లో అతగాడు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయినా ఈ నటి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వారికి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషలలో ఎన్నో సినిమాలు చేసింది. అయితే పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు ప్రియమణి ఇండస్ట్రీకి దూరం అయిందని చెప్పి తీరాలి. ఇక ఇప్పుడు అటు వెండి తెరపైన సినిమాలతోను.. బుల్లి తెరపైన వెబ్ సిరీస్ లతో, టీవీ షోస్ తో నిమిషం తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపేస్తోంది. తాజాగా రంజాన్ సంధర్బంగా ప్రియమణి షేర్ చేసిన కొన్ని ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీనితో .. ఈమె గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. నటిగా ప్రియమణి అందరికి తెలుసు కానీ.. ఆమె గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి.

ప్రియమణి అసలు పేరు.. ప్రియా వాసుదేవ్ మణి అయ్యర్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పేరును షార్ట్ కట్ చేసి ప్రియమణిగా కొనసాగుతోంది. 2003 లో అతగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడికి.. మొదటి సినిమా ప్లాప్ అవ్వడంతో నిరాశ ఎదురయ్యింది. ఆ తర్వాత జగపతి బాబు నటించిన పెళ్ళైన కొత్తలో సినిమాతో ప్రియమణికి మంచి గుర్తింపు లభించింది. అటు తమిళంలో పరుత్తివీరన్ సినిమాలో కార్తీ కు జోడిగా నటించి.. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుసగా సినిమాలలో నటించి.. మంచి హిట్స్ ను అందుకుంది ప్రియమణి. హీరోయిన్ గా తన కెరీర్ మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే 2017లో ముస్తఫా రాజాను పెళ్లిచేసుకుంది. అతడు ముస్లిం మతస్తుడు. ఇక అప్పటినుంచి తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ.. ముస్లిం మతాన్ని కూడా గౌరవిస్తూ రంజాన్ వేడుకలను కూడా జరుపుకుంటూ ఉంటుంది. ఆమె లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ కూడా అందుకు సంబంధించినవే. అయితే పెళ్లి తర్వాత కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీకి దూరం అయిన ప్రియమణి.. మళ్ళీ ఇప్పుడు చేతినిండా టీవీ షోలు, వెబ్ సిరీస్ లు, సినిమాలతో.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన సత్తా చూపిస్తోంది.

Priyamani

ఇక ప్రస్తుతం తాను చేసే సినిమాలకు, సిరీస్ లకు కోట్లలో రెమ్యునిరేషన్ తీసుకుంటున్న ప్రియమణి. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజులలో తానూ తీసుకున్న మొదటి పారితోషకం కేవలం రూ.500 మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తానూ తీసుకున్న మొదటి జీతాన్ని ఇప్పటికీ కూడా ఎంతో భద్రంగా దాచుకున్నాను అని కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే ఏదైనా ఒక సినిమాలో మేకప్ లేకుండా నటించాలని ఉందంటూ ముచ్చటించ్చింది. ఇక బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో అడుగుపెట్టింది. ఆ వెబ్ సిరీస్ లో ప్రియమణి నటనకు ప్రత్యేకమైన ప్రశంసలు దక్కాయి. ఇక తాజాగా అజయ్ దేవఘన్ “మైదాన్” చిత్రంలో కూడా ఈమె ప్రధాన పాత్రలో అలరించింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇటు సోషల్ మీడియాలోను నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది ప్రియమణి. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి