iDreamPost
android-app
ios-app

Prithvi Shaw: సెంచరీతో దుమ్మురేపిన పృథ్వీ షా! టీమిండియాలోకి రీఎంట్రీ?

  • Published Feb 09, 2024 | 12:35 PM Updated Updated Feb 09, 2024 | 12:35 PM

పృథ్వీ షా.. టీమిండియాకి దూరమైనా భారత క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఒక సూపర్‌ సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా.. తన అభిమానుల్లో మళ్లీ ఆశలు రేపుతున్నాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

పృథ్వీ షా.. టీమిండియాకి దూరమైనా భారత క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఒక సూపర్‌ సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా.. తన అభిమానుల్లో మళ్లీ ఆశలు రేపుతున్నాడు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 09, 2024 | 12:35 PMUpdated Feb 09, 2024 | 12:35 PM
Prithvi Shaw: సెంచరీతో దుమ్మురేపిన పృథ్వీ షా! టీమిండియాలోకి రీఎంట్రీ?

టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా సెంచరీతో అదరగొట్టాడు. ఐదేళ్ల క్రితం ఇండియన్‌ క్రికెట్‌లో మారుమోగిన పేరు పృథ్వీషా. అండర్‌ 19 క్రికెట్‌ నుంచి టీమిండియాలోకి రాకెట్‌లా దూసుకొచ్చిన కుర్రాడు.. అంతే వేగంగా జట్టును బయటికి వెళ్లాడు. మరో వీరేందర్‌ సెహ్వాగ్‌ అవుతాడనుకుంటే.. అంత సీన్‌ లేదని కొన్ని మ్యాచ్‌లకే నిరూపించాడు. కానీ, ఇప్పుడు మళ్లీ తన పాత రోజుల్ని గుర్తు చేస్తూ.. సూపర్‌ సెంచరీతో ఆశలు రేకెత్తిస్తున్నాడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో ముస్తాక్‌ అలీ ట్రోఫీ, విజయ్‌ హాజారే ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మక దేశవాళి ట్రోర్నీలను మిస్‌ అయిన పృథ్వీషా తాజాగా రంజీ ట్రోఫీ 2024లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లు మిస్‌ అయినా.. వచ్చీ రావడంతోనే సూపర్‌ సెంచరీతో సత్తా చాటాడు. తనలో ఇంకా వేడి తగ్గలేదని నిరూపించాడు.

శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌తో ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన షా.. సూపర్‌ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. మరో ఓపెనర్‌ భూపెన్‌ లాల్వానితో కలిసి ముంబైకి మంచి ఆరంభాన్ని అందించడమే కాకుండా.. తనకు అలవాటైన అగ్రెసివ్‌ బ్యాటింగ్‌తోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 107 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సులతో 101 పరుగులు చేసి.. నాటౌట్‌గా ఉన్నాడు. పృథ్వీ షా అద్భుత ప్రదర్శనతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. వికెట్‌ కోల్పోకుండా.. 140 పరుగులతో నిలకడగా ఉంది. అయితే.. ఈ సెంచరీతో పృథ్వీ షా మరోసారి సెలెక్టర్లు తన పేరును గుర్తు చేసినట్లు అయింది. తాజా ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే.

తొలి రెండు టెస్టుల ముగియగా.. చివరి మూడు టెస్టులు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మూడు టెస్టులకు జట్టును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో పృథ్వీ షా సెంచరీ సాధించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే.. ఇంత త్వరగా షాకు టీమిండియాలో రీ ఎంట్రీ లభిస్తుందని అనుకోలేం కానీ, ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తే.. భవిష్యత్తులో అవకాశం రావచ్చు. ప్రస్తుతం షాకు 24 ఏళ్లు మాత్రమే. టీమిండియా 2018లోనే ఎంట్రీ ఇచ్చిన షా.. 5 టెస్టులు, 6 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడాడు. టెస్టుల్లో ఒక సెంచరీ కూడా చేశాడు. కానీ, తర్వాత వరుసగా విఫలం అవ్వడంతో షాను పక్కనపెట్టారు. చివరి సారిగా 2020లో టెస్ట్‌, 2021లో వన్డే, టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరి పృథ్వీ షా సెంచరీతో పాటు, టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.