iDreamPost

జైలులో ప్రేమలో పడి పెరోల్ లో పెళ్లి చేసుకున్న ఖైదీలు

జైలులో ప్రేమలో పడి పెరోల్ లో పెళ్లి చేసుకున్న ఖైదీలు

ప్రేమ.. దీనికి వయసుతో పని లేదు. కులం, మతం, ప్రాంతంతో అసలే పని లేదు. ప్రేమ ఎప్పుడు ఎలా అయినా పుట్టొచ్చు. ఇద్దరి మనుషుల కలయికలో మొదట పరిచయంతో మొదలై అది స్నేహంగా మారుతుంది. అదే స్నేహం చివరికి ప్రేమగా కూడా మారొచ్చు. ఇలా ఎంతో మంది ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ, మీరు ఇప్పుడు చదవబోయి ప్రేమకథ మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఓ యువతి, యువకుడు జైలులో ప్రేమించుకుని ఆ తర్వాత పెరోల్ లో బయటకు వచ్చి తాజాగా పెళ్లి చేసుకున్నారు. సినిమా స్టోరీని మించిన ఈ లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అస్సాంకు చెందిన అబ్దుల్ హసీమ్, పశ్చిమ్ బెంగాల్ కు చెందిన షహనారా ఖాతున్ లు ఇద్దరు వేరు వేరు హత్య కేసుల్లో దోషులుగా ఉన్నారు. అయితే, వీళ్లిద్దరు పశ్చిమ బెంగాల్ లోని తూర్పు బర్దమాన్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇద్దరిదీ ఒకే జైలు కావడంతో వీరి మధ్య పరిచయం మొదలైంది. ఈ పరిచయంతోనే ఇద్దరు రోజూ కలిసి మాట్లాడుకోవడం చేసేవారు. ఈ క్రమంలోనే ఇద్దరి స్నేహం కాస్త చివరికి ప్రేమగా మారింది. దీంతో ఈ ప్రేమికులు రోజూ కలిసి మాట్లాడుకునేవారు. అలా వీరి ప్రేమాయణం కొన్ని నెలల పాటు కొనసాగింది.

ఇక మొత్తానికి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని వారి ఇరువురి కుటుంబ సభ్యులు జైలుకు వచ్చినప్పుడు వివరించారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. ఇక ఇంకేముంది.. వీళ్లు పెరోల్ లో బయటకు వచ్చి ఇటీవల కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి కూడా చేసుకున్నారు. పెరోల్ లో భాగంగా వీళ్లు కేవలం 5 రోజులు మాత్రం బయట ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. అబ్దుల్ హసీమ్ కు 8 ఏళ్లు, షహనారాకు 6 ఏళ్ల జైలు శిక్ష పడింది. వీరి పెళ్లి అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: చనిపోయిన పెంపుడు కుక్కు.. సమాధి కట్టి పెద్దకర్మ చేసిన యజమాని

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి