iDreamPost

అయ్యో ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దు.. ఏడాది నుంచి టాయిలెట్‌లోనే..

Old Woman Living Toilet: దేశంలో ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం అహర్నిశలు కష్టపడుతున్నామంటారు. కానీ కోట్ల మందికి కనీస వసతి లేక దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.

Old Woman Living Toilet: దేశంలో ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం అహర్నిశలు కష్టపడుతున్నామంటారు. కానీ కోట్ల మందికి కనీస వసతి లేక దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.

అయ్యో ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దు.. ఏడాది నుంచి టాయిలెట్‌లోనే..

దేశంలో రాజకీయ నేతలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు. మనిషికి కట్టుకునేందుకు బట్ట, ఉండేందుకు గూడు, నినేందుకు తిండి కనీస అవసరాలు. భారత దేశంలో నివసిస్తున్న ప్రతి మనిషి కనీస హక్కు.కానీ దేశంలో ఎంతమోంది కూడు,గుడ్డ, నీడ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఉండటానికి కనీసం గజం స్థలం లేక చెట్ల కింద, ఫుట్ పాత్ లపై జీవితాన్ని వెల్లదీస్తున్నారు. దేశంలో ఇలాంటి వారు కోట్ల మంది ఉన్నారు. పిల్లలు ఉన్నా అనాథగా ఉన్న ఓ వృద్దురాలు ఉండటానికి కనీసం నివాసం లేక మరుగుదొడ్డినే నివాసంగా చేసుకొని కాలం వెల్లదీస్తుంది. పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తమ ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాయి. కానీ కోట్ల మంది కనీసం ఉండటానికి సరైన నివాసం లేక దుర్బరమైన జీవితాలు గడుపుతున్నారు. ఓ వృద్దురాలు ఎండా, వాన, చలి నుంచి రక్షించుకోవడం కోసం టాయిలెట్ లో నివసిస్తుంది. పశ్చిమ బెంగాల్ లోని సుంద్రాడి గ్రామ నివాసి 66 ఏళ్ల మిథిలా మహాతో కి ఇద్దరు కుమార్తెలు. వారిద్దరి వివాహం చేసిన తర్వాత ఒంటరిగా జీవిస్తుంది మిథిలా. ఆమె నివసిస్తున్న ఇళ్లూ పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని వర్షాల కారణంగా కూలిపోయింది. ఆ సమయంలో గ్రామస్థులు మిథిలా పరిస్థితి పంచాయతీ అధికారులు తెలియజేయడంతో ఒక ప్లాస్టీక్ కవర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో చేసేదేం లేక మిథిలా అక్కడే ఉన్న ఓ మరుగుదొడ్డిలో నివసిస్తుంది.

గత ఏడాది నుంచి మిథిలా మహాతో కేవలం 4 అడుగుల వెడల్పు, 3 అడుగుల పొడవు తో ఉన్న ఒక టాయిలెట్ ని తన నివాసంగా మల్చుకొని ఎండా, వాన, చలి నుంచి రక్షించుకుంటుంది. కన్న బిడ్డలు ఏనాడూ వచ్చి తల్లి పరిస్థితి గురించి తెలుసుకోలేదు. ఈ క్రమంలోనే మిథిలా మహాతో అత్యంత దుర్బరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఆమె పరిస్థితి గురించి స్థానికులు కొంతమంది  ఎన్నిసార్లు పాలనాధికారికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. టాయిలెట్ లో ఉంటూ చిన్న చిన్న పనులు చేస్తూ తన కడుపు నింపుకుంటుంది. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో పరిస్థితిని పరిశీలించి ఆమె వరకు ఓ చిన్న ఇంటిని నిర్మించి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ విషయంపై అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి