iDreamPost

సినిమాగా మోదీ జీవిత చరిత్ర.. ఆసక్తికర టైటిల్‌ ఖరారు!

Biography of Modi as a Movie: దేశంలో ఎంతోమంది చరిత్ర కారుల జీవిత చరిత్ర ఆధారంగా కొన్ని బయోపిక్స్ రూపొందిస్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్ చిత్రాలకు మంచి ఆధరణ లభిస్తుంది.

Biography of Modi as a Movie: దేశంలో ఎంతోమంది చరిత్ర కారుల జీవిత చరిత్ర ఆధారంగా కొన్ని బయోపిక్స్ రూపొందిస్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్ చిత్రాలకు మంచి ఆధరణ లభిస్తుంది.

సినిమాగా మోదీ జీవిత చరిత్ర.. ఆసక్తికర టైటిల్‌ ఖరారు!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా.. వివిధ రంగాల లెజెండ్రీల జీవిత కథ ఆధారంగా ఇప్పటికే కొన్ని చిత్రాలు వచ్చాయి. ఇలాంటి బయోపిక్ లో ఎక్కువగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్నాయి. కొన్ని చారిత్రక నేపథ్యంలో బయోపిక్ లు వస్తున్నాయి. చాలా వరకు బయోపిక్ చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి.. కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు పలువురు రాజకీయ నేతలకు సంబంధించిన బయోపిక్ లు వచ్చాయి. తాజాగా రాజకీయాల్లో తనదైన మార్క్ చాటుకుంటూ.. కోట్ల మంది ప్రజల హృదయాలు గెల్చుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బయెపిక్ తెరకెక్కబోతుంది. వివరాల్లోకి వెళితే..

గుజరాత్ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా వ్యహరించిన ప్రధాని నరేంద్ర మోదీ రెండు సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చి భారత రాజకీయాల్లో భారత ప్రధానిగా తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కృషి చేశారు. నిన్న అంగరంగ వైభవంగా అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. దీంతో నరేంద్ర మోదీ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. కోట్ల మంది ప్రజల హృదయాలు గెల్చుకున్న జనహృదయ నేత నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ఆయన బయోపిక్ మూవీ తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘విశ్వవిజేత’ పేరుతో అన్ని భారతీయ భాషల్లో ఈ మూవీ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీకి సీ.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వంలో వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్నారు.  అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుప్ ఖేర్, పల్లవి జోషీ ముఖ్యపాత్రల్లో నటించోతున్నట్లు తెలుస్తుంది. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి కుమారుడు కాలబైరవ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రంలో ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయాలు.. డిమోనిటైజేషన్, ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ, అయోద్య రామ మందిరం లాంటి కీల అంశాలు చూపించబోతునట్లు తెలుస్తుంది. ఒక సామాన్యుడు చావా వాలా స్థాయి నుంచి ‘విశ్వనేత’ గా ఎదిగిన ఆయన ప్రస్థానం ఈ మూవీలో చూపించబోతునట్లు సినిమా యూనిట్ చెబుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి