iDreamPost
android-app
ios-app

Premalu: తెలుగులోనూ ప్రేమలు సూపర్ కలెక్షన్స్! ఎన్ని కోట్లు వచ్చాయంటే?

చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టొచ్చని నిరూపించింది ప్రేమలు చిత్రం. ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఇక్కడ కూడా సూపర్ కలెక్షన్లను కొల్లగొడుతోంది.

చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టొచ్చని నిరూపించింది ప్రేమలు చిత్రం. ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఇక్కడ కూడా సూపర్ కలెక్షన్లను కొల్లగొడుతోంది.

Premalu: తెలుగులోనూ ప్రేమలు సూపర్ కలెక్షన్స్! ఎన్ని కోట్లు వచ్చాయంటే?

ఇంట్రస్టింగ్ పాయింట్ తీసుకుని ప్రేక్షకులను కట్టిపడేసేటట్లుగా కథనాన్ని నడిపిస్తూ సినిమాను తెరకెక్కిస్తోంది మలయాళ ఇండస్ట్రీ. అదీ ప్రేమ కథలైనా, క్రైమ్, హారర్ జోనైనా. అందుకే తెలుగులో మలయాళ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాకు మంచి టాక్ వస్తే థియేటర్ అయినా, ఓటీటీ అయినా మాలీవుడ్ సినిమాలను ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. మరోసారి రుజువైంది ప్రేమలు విషయంలో. చిన్న సినిమాగా వచ్చిన ఈ రామ్ కామ్ (రొమాన్స్ అండ్ కామెడీ) కేరళలో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగు హక్కులను సొంతం చేసుకున్నాడు దర్శక ధీరుడు తనయుడు కార్తీకేయ. ఇక టాలీవుడ్‌లో కూడా ట్రెండ్ సెట్ చేస్తుంది ప్రేమలు మూవీ.

నస్లేన్ కె గఫూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి దర్శకుడు గిరీష్ ఏడీ. తెలుగు వర్షన్‌కు 90s మిడిల్ క్లాస్ బయోపిక్ చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్ మాటలు అందించాడు. అతడి తెలుగు డైలాగ్స్.. ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. మార్చి 8న విడుదల తెలుగులో విడుదలైంది ఈ చిత్రం. బాక్సాఫీసు వద్ద డీసెంట్ హిట్ కొట్టి కలెక్షన్లను కుమ్మేస్తోంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రానికి ఫిదా అయిపోయిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.. ఓ లెవల్లో ఈ సినిమాను పొగిడేశాడు. మలయాళ ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే ఊహించినట్లుగానే మంచి కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ పది రోజుల్లో ప్రేమలు సినిమా రూ. 10. 54 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాబట్టుకున్న మలయాళ చిత్రం బహుశా ఇదేనేమో.

ఇక కథ విషయానికి వస్తే ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఓ కుర్రాడు యూకే వెళ్లాలని అనుకుంటాడు. కానీ వీసా రిజెక్ట్ కావడంతో.. గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చి.. హీరోయిన్ ప్రేమలో పడతాడు. ఆ విషయాన్ని హీరోయిన్‌కు చెబితే.. రిజక్ట్ చేస్తుంది. మరీ ఆ తర్వాత ఏం చేశాడు. అతడి ప్రేమ కథ సక్సెస్ అయ్యిందా అన్నది మిగిలిన కథ. ప్రేమ కథకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. కాస్త విభిన్నంగా తెరకెక్కిస్తే.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపింంచింది ప్రేమలు చిత్రం. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో రానుంది. ఈ మూవీ హక్కులను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler