iDreamPost

లియో నేర్పిన పాఠం! ప్రశాంత్ నీల్ సీక్రెట్ రివీల్ చేసేశాడు!

సలార్‌ సినిమా డిసెంబర్‌ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌ ప్రమోషన్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా స్టోరీ విషయంలో...

సలార్‌ సినిమా డిసెంబర్‌ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌ ప్రమోషన్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా స్టోరీ విషయంలో...

లియో నేర్పిన పాఠం! ప్రశాంత్ నీల్ సీక్రెట్ రివీల్ చేసేశాడు!

సినిమా విజయం అనేది చాలా అంశాల పైన ఆధారపడి ఉంటుంది. వీటిల్లో అతి ముఖ్యమైనది ప్రమోషన్స్. ఈ విషయంలో రాజమౌళిది మాస్టర్ మైండ్. తాను ఏ కథ చెప్పబోతున్నాడో ఆడియన్స్ కి ముందే హింట్ ఇచ్చేస్తాడు. ఈ జాగ్రత్త తెలియకే.. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ లియోతో పరాజయాన్ని అందుకున్నాడు. దీని నుండి పాఠం నేర్చుకున్న సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. తన సినిమా విడుదల డేట్ దగ్గర పడుతున్న సమయంలో.. ముందుగానే మీడియా ముందుకి వచ్చి.. ఓ అనవసరపు ఒత్తిడి తనపై నుండి తగ్గించేసుకున్నాడు. ఇంతకీ లియో.. విషయంలో లోకీ చేసిన తప్పు ఏంటి? దాని నుండి ప్రశాంత్ నీల్ నేర్చుకున్న పాఠం ఏమిటి? ఇది సలార్ సక్సెస్ కి ఎలా కారణం కాబోతుంది? ఇలాంటి అన్నీ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సలార్.. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఎలాగో రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసింది. మూవీ టీమ్ ప్రమోషన్స్ కి కూడా ప్లాన్ చేసేస్తోంది. ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ నుండి సలార్ కి సంబంధించిన కొన్ని లీక్స్ బయటకి వచ్చేశాయి. “ఇద్దరు స్నేహితులు.. ఎలా శత్రువులుగా మారారు అన్నది సలార్ కథ. దీనికి.. కేజియఫ్ ఫ్రాంచైజీతో ఎలాంటి సంబంధం లేదు”. ఇది నీల్ రివీల్ చేసిన పాయింట్. దీంతో.. చాలా మంది డార్లింగ్ ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. కేజియఫ్ తో లింక్ లేకపోయినా.. కనీసం ఓపెనింగ్స్ కోసం అయినా.. ఈ మ్యాటర్ ని హైడ్ చేసి ఉండాల్సింది అనేది వారి బాధ. కానీ.., ఇక్కడ ప్రశాంత్ నీల్ లెక్క వేరే ఉంది. కొన్ని రోజుల ముందే ప్రేక్షకుల ముందుకి వచ్చి.. సో.. సో.. అనిపించుకున్న లియో మూవీ పరిస్థితి సలార్ కి రాకూడదు అన్నది నీల్ ఆలోచన.

లోకీ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే లియో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగానే కురిపించింది. కానీ.., టాక్ తేడా కొట్టేసింది. టాక్ బాగుండి ఉంటే లియో క్లోజింగ్ కలెక్షన్స్ వేరే లెవల్ లో ఉండేవి. అలా అని లియో మూవీ బాగా లేదా అంటే.. ఇప్పుడు ఓటీటీలో చూస్తున్న వారంతా బ్రహ్మరథం పడుతున్నారు. కానీ.., ధియేటర్స్ లో ఉన్నపుడు మాత్రం వీరి రియాక్షన్ వేరుగా వచ్చింది. కారణం ఎక్స్ పెక్టేషన్స్. లియోకి.. లోకీ యూనివర్స్ తో పెద్దగా లింక్ ఉండదని.. రిలీజ్ కి ముందే లోకీ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే.. లియోని ఆడియన్స్ ఓ మామూలు మూవీగా ఆస్వాదించి ఉండేవారు. కానీ.., అలాంటి ప్రకటన రాకపోవడంతో.. విక్రమ్, ఖైదీ రిఫరెన్స్ ల కోసం వెతుకుతూ.. ప్రేక్షకులు అసలు కథని ఆస్వాదించలేకపోయారు. ఈ తప్పు సలార్ విషయంలో జరగకూడదన్నదే నీల్ ఆలోచన. ఇందుకే కేజియఫ్ కి, సలార్ కి లింక్ లేదని ఓపెన్ అయిపోయాడు. మరి.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యి.. సలార్ సూపర్ హిట్ అవుతుందని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి