iDreamPost

పెళ్ళైతే లైఫ్ క్లోజ్ అనుకునే అమ్మాయిలకి ఈమె జీవితమే పెద్ద ఉదాహరణ

మహిళల ఎదుగుదలకి పెళ్లి అడ్డు కాదనడానికి ఈమె సక్సెసే ఒక ఉదాహరణ. పెళ్ళైతే ఇక నా చాప్టర్ క్లోజ్, నా హెలికాప్టర్ క్లోజ్ అనుకునే అమ్మాయిలు ఈమె కథ తెలుసుకుంటే కలలు ఏమైనా ఉంటే నెరవేర్చుకుంటారు. లక్ష్యం ఏదైనా ఉంటే ఛేదిస్తారు.

మహిళల ఎదుగుదలకి పెళ్లి అడ్డు కాదనడానికి ఈమె సక్సెసే ఒక ఉదాహరణ. పెళ్ళైతే ఇక నా చాప్టర్ క్లోజ్, నా హెలికాప్టర్ క్లోజ్ అనుకునే అమ్మాయిలు ఈమె కథ తెలుసుకుంటే కలలు ఏమైనా ఉంటే నెరవేర్చుకుంటారు. లక్ష్యం ఏదైనా ఉంటే ఛేదిస్తారు.

పెళ్ళైతే లైఫ్ క్లోజ్ అనుకునే అమ్మాయిలకి ఈమె జీవితమే పెద్ద ఉదాహరణ

చాలా మంది పెళ్లి అయితే తాము కన్న కలలు కలలుగానే మిగిలిపోతాయని అనుకుంటారు. పెళ్లి అయితే ఇక లైఫ్ అయిపోయిందని అనుకుంటారు. అయితే పెళ్లి అయిపోతే జీవితం ఆగిపోదని.. అనుకున్న లక్ష్యాన్ని పెళ్లి, సంసారం, బాధ్యతలు ఆపవని ఓ మహిళ నిరూపించారు. ఆమె పేరు ప్రగతి రాణి. హర్యానాలోని కురుక్షేత్రలో పెరిగిన ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న కలను సాధించారు. ఒక పక్క పిల్లల తల్లిగా ఉంటూ మరో పక్క రేడియాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. అయితే ఆమెకు ఐఏఎస్ అవ్వాలన్న డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ కి ఇవేమీ అడ్డు కాదు అని అనుకున్నారు. భర్త డాక్టర్ అతుల్ వర్మ మద్దతుతో ఆమె సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ను ప్రారంభించారు. ఆ సమయంలో ఆమెకు ఆరు నెలల బాబు ఉన్నాడు. ఆ బాబుని చూసుకుంటూనే ఆమెను ఈ ఛాలెంజ్ ని స్వీకరించారు. దీని కోసం ఆమె ఏ కోచింగ్ క్లాసులకు వెళ్ళలేదు. ఇంటి దగ్గరే ప్రిపరేషన్ కొనసాగించారు.

ఒక పక్క ఇంటి పనులు, బాబుని చూసుకోవాలి, మరో పక్క ఉద్యోగం చేయాలి. ఆమెకు ఎక్కువ సమయం లేదు. అలా అని కొడుకుని పట్టించుకోకుండా ఉండలేదు. కొడుకుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూనే ఆమెకు ఉన్న సమయంలోనే ఆమె ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యారు. అయితే కొన్నిసార్లు బాబు అమ్మమ్మ దగ్గరకి వెళ్ళేవాడు. ఆ సమయంలో ఆమె మరింత క్వశ్చన్స్ ని సాల్వ్ చేసుకోవడం, కొన్ని టాపిక్స్ ని కవర్ చేసుకోవడం చేసేవారు. రాత్రి 9.30 కి నిద్రపోయేవారు. రోజూ 3 లేదా 4 గంటల చదివేవారు. గడిచిన రెండేళ్లలో రెండు సార్లు యూపీఎస్సీ, హర్యానా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సహా మూడు ప్రతిష్టాత్మక పరీక్షలను ఆమె క్లియర్ చేశారు. ఈ పరీక్షల్లో ఆమె స్టేట్ సెకండ్ టాపర్ గా నిలిచారు. 2021లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో జస్ట్ మిస్ అవ్వడంతో ఆమెలో పట్టుదల మరింత పెరిగింది. ఆమె మరింత కష్టపడుతూ ఈ ఏడాది యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో 355వ రాంక్ సాధించారు. తల్లిగా కొడుకుని చూసుకుంటూనే.. మరో పక్క కెరీర్ ని బ్యాలన్స్ చేసుకుంటూ ఎగ్జామ్స్ ని క్లియర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆరు నెలల కొడుకు అంటే ఎదిగే వయసు. అల్లరి చేసే వయసు. అమ్మ అవసరం కావాలనుకునే వయసు. ఎల్లవేళలా అమ్మనే అంటిపెట్టుకుని ఉండే వయసు. అలాంటి ఛాలెంజెస్ ని ఆమె అధిగమించి ఇవాళ విజేతగా నిలిచారు.

2022-23 యూపీఎస్సీ పరీక్షలో ఆమెకు 740వ ర్యాంక్ వచ్చింది. దీంతో ఆమె ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా, నగర్ హవేలీలో ఏదో ఒక దాంట్లో సివిల్ సర్వీసెస్ లో డానిక్స్ క్యాడర్ కింద పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఆమె హర్యానా సివిల్ సర్వీసెస్ లో చేరడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఎగ్జామినేషన్ లో సెకండ్ పొజిషన్ లో నిలిచారు. నవంబర్ 2023లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ప్రగతి రాణి.. అంబాలా డివిజినల్ కమిషనర్ గా స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా చేరారు. అక్కడ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా కొనసాగుతూనే యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో మెరుగైన స్కోర్ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో ఆమె ప్రిపరేషన్ చాలా కష్టం. ఎందుకంటే కొడుకు కొంచెం ఎదిగాడు. ఊహ తెలిసింది. అమ్మ వేరే గదిలో చదువుకుంటుందని తెలిసి ఆమె దగ్గరకు వెళ్లి తనతో ఆడుకోమని అడిగేవాడు. అది నిజంగా చాలా క్లిష్టమైన దశ. కానీ ఆమె కొడుకుని నిర్లక్ష్యం చేయలేదు. ప్రొఫెషన్ ని నిర్లక్ష్యం చేయలేదు. వేటినీ నిర్లక్ష్యం చేయకుండానే ఆమె తన లక్ష్యాన్ని చేరుకున్నారు. పెళ్ళైతే ఇక లైఫ్ ఆగిపోయింది అనుకునే అమ్మాయిలకు ఈమె జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. మరి సవాళ్ళను ఎదిరించి సక్సెస్ కే చిరునామాగా మారిన ప్రగతి రాణిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి