iDreamPost

సలార్ సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికేట్ ఇచ్చారో తెలుసా?

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.

సలార్ సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికేట్ ఇచ్చారో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ సలార్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా సలార్. ఈ సినిమాపై ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంచనాలకు మించి సలార్ చిత్రం ఉండబోతోందని ఇప్పటికే అర్థమైపోయింది. ఈ క్రమంలో సలార్ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సలార్ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ మూవీ గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్, టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన సలార్ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేసింది. 24 గంటలు కూడా గడవక ముందే మిలియన్ వ్యూస్ తో సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక తాజాగా సలార్ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. మూవీ రన్ టైం 2 గంటల 55 నిమిషాల 22 సెకండ్స్ గా ఉండనుంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతోంది.

హైవోల్టేజ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. అయితే సలార్ రన్ టైం దాదాపు మూడు గంటల నిడివితో ఉండడంతో కంటెంట్ లో దమ్ముందని చెప్పకనే చెప్పినట్లైంది. ప్రభాస్ రేంజ్ కు తగినట్లుగానే కంటెంట్ సిద్ధం చేశారు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా శ్రితిహాసన్ నటిస్తుండగా పృధ్వీరాజన్ సుకుమారన్, జగపతి బాబు, శ్రీయా రెడ్డి, బాబీ సింహా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి