iDreamPost

బుజ్జి- భైరవ ట్రైలర్ లో ఇవి గమనించారా? నాగ్ అశ్విన్ కథ మొత్తం చెప్పేశాడుగా!

Prabhas Kalki 2898 AD- Bujji Bhairava Trailer Review: ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కీ 2898 ఏడీ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి కొత్తగా బుజ్జి- భైరవ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి.. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

Prabhas Kalki 2898 AD- Bujji Bhairava Trailer Review: ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కీ 2898 ఏడీ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి కొత్తగా బుజ్జి- భైరవ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి.. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

బుజ్జి- భైరవ ట్రైలర్ లో ఇవి గమనించారా? నాగ్ అశ్విన్ కథ మొత్తం చెప్పేశాడుగా!

బుజ్జి- భైరవ గత కొన్ని రోజులుగా ఈ పేర్లే బాగా వినిపిస్తున్నాయి. సినిమా ప్రేక్షకులే కాదండోయ్.. సినిమా మేకర్స్ కూడా వీళ్ల గురించి తెగ ఎదురుచూస్తున్నారు. వీళ్లు రావడానికి ఇంకా కాస్త టైమ్ ఉన్నా కూడా.. వీళ్లు క్రియేట్ చేస్తున్న బజ్ మాత్రం మామూలుగా ఉండటం లేదు. ఒక్కో అప్ డేట్ తో పిచ్చెక్కిస్తున్నారు. ఇప్పటికే భైరవ.. బుజ్జిని చూసిన ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరి గురించి వివరిస్తూ ఒక యానిమేటెడ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఎప్పుడెప్పుడు ఈ ట్రైలర్ వస్తుందా అని అంతా ఎదురుచూశారు. ఆ సమయం రానే వచ్చింది. మరి.. ట్రైలర్ ఎలా ఉంది? అసలు అందులో చెప్పిన విషయాలు ఏంటో చూద్దాం.

కథ ఏంటి?:

కల్కీ 2898 ఏడీ అనే సినిమాని ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కల్కి అవతారం కోసం ఎదురు చూస్తూ ఉండే అశ్వత్థామను కూడా చూశాం. అయితే ఈ ఫస్ట్ పార్ట్ లో ఎక్కువగా బుజ్జి అలాగే భైరవ మధ్య ఉండే బాండింగ్ గురించే ఎక్కువగా చూపించే ఆస్కారం కనిపిస్తోంది. భైరవకు అసలు తాను ఎవరు? తన శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియని ఒక్ సాదా సీదా కుర్రాడు అనే విషయం అర్థమవుతోంది. అతనికి ఒక మోడ్రన్ రిక్షా ఉంది. దానితో కాలం గడిపేస్తూ ఉంటాడు. అయితే అతనికి వాహనం ధ్వంసం అయిపోతుంది. దానితో అతని పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. దాంతో స్క్రాప్ నుంచి బుజ్జిని తయారు చేస్తాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో వైరల్ అవుతున్న ఇంజినీరింగ్ అద్భుతమే ఆ బుజ్జి.

బుజ్జి ది రోబో:

మూవీలో ఈ బుజ్జిని స్వయంగా భైరవానే తయారు చేస్తాడు. తనకు దొరికిన ఒక అడ్వాన్స్డ్ రోబోని ఈ బుజ్జిలో ఇన్ స్టాల్ చేస్తాడు. ఇన్నాళ్లు మనం చెప్పుకున్న విధంగా ఆ కారును.. రోబో ఓన్ గానే ఆపరేట్ చేయగలదు. ఆ విషయాన్ని ఈ యానిమేటెడ్ వీడియోలో చూపించారు. ఈ ట్రైలర్ కేవలం వీళ్లిద్దరి బాండింగ్ గురించి మాత్రమే కాబట్టి కథను కూడా వారి వరకే పరిమితం చేశారు. బుజ్జి- భైరవ మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ అర్థమైపోయింది. అలాగే భైరవకి ఏ కష్టం వచ్చినా బుజ్జి కాపాడుతుందని క్లారిటీ వచ్చింది. కాబట్టి మూవీలో వీళ్ల బాండింగ్ హైలెట్ కాబోతోంది.

అయితే అసలు కథ మాత్రం పార్ట్ 2లోనే వచ్చే అవకాశం ఉంది. మొదటి భాగాన్ని కేవంల పాత్రలను, కల్కి సినిమా ప్రపంచాన్ని పరిచయం చేయడానికి నాగ్ అశ్విన్ ప్లాన్ చేసి ఉండచ్చు. ఒక భారీ యుద్ధంతో మొదటి భాగాన్ని ఎండ్ చేసి.. రెండో భాగాన్ని మాత్రం ఫుల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ లతో నింపేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మూవీలో చాలానే క్యామియో అప్పియరెన్సెస్ ఉన్నాయి కాబట్టి.. రెండు భాగాలు కచ్చితంగా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. మరి.. బుజ్జి- భైరవ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి