iDreamPost

Kalki 2898 AD: రిలీజ్ కు ముందే వేట మెుదలుపెట్టిన ‘కల్కి’.. RRR రికార్డ్స్ బ్రేక్! ప్రభాస్ రేంజ్ ఇది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం రిలీజ్ కు ముందే.. రికార్డుల వేట మెుదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టి.. దూసుకెళ్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం రిలీజ్ కు ముందే.. రికార్డుల వేట మెుదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టి.. దూసుకెళ్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Kalki 2898 AD: రిలీజ్ కు ముందే వేట మెుదలుపెట్టిన ‘కల్కి’.. RRR రికార్డ్స్ బ్రేక్! ప్రభాస్ రేంజ్ ఇది..

సాధారణంగా సినిమాలు రిలీజ్ అయ్యాక రికార్డులు బద్దలు కొడతాయి. కానీ ఇందుకు భిన్నంగా ప్రభాస్ దూసుకెళ్తున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఓవర్సీస్ లో ఓ రోజు ముందుగానే విడుదల కానుంది. ఇక ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలై ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మూవీపై భారీగా అంచనాలు కూడా పెరిగాయి. కాగా.. కల్కి రిలీజ్ కు ముందే తన రికార్డుల వేట మెుదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డును బద్దలు కొట్టింది.

ఇటీవల విడుదలైన కల్కి ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. హాలీవుడ్ రేంజ్ టేకింగ్ తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మెస్మరైజ్ చేశాడు. విజువల్స్ అయితే నెక్ట్స్ లెవల్ అంటూ ప్రశంసిస్తున్నారు సినీ పండితులు. అంత రిచ్ గా, క్వాలిటీగా వీఎఫ్ఎక్స్ ఉండటంతో ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ మూవీని థియేటర్లలో చూద్దామా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మేకర్స్ సైతం ట్రైలర్ లో చూసింది కొంచెమే అని, సినిమా చూశాక అభిమానుల మైండ్ బ్లాక్ అవుతుందని స్టేట్ మెంట్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. సినిమా రిలీజ్ కాకముందే కల్కి రికార్డుల వేటను మెుదలుపెట్టేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమెరికాలో ప్రి బుకింగ్స్ లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సెట్ చేసిన రికార్డును బద్దలు కొట్టిందని తెలుస్తోంది. అమెరికాలో తక్కువ టైమ్ లో 1 మిలియన్ కలెక్షన్లు క్రాస్ చేసిన సినిమాగా కల్కి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇంతకు ముందు ఈ రికార్డు ఆర్ఆర్ఆర్ పేరిట ఉండేది. కాగా.. సినిమా రిలీజ్ కు ఇంకా సమయం ఉండటంతో.. కలెక్షన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్ లాంటి భారీ తారాగాణం నటిస్తున్నారు ఇందులో. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మరి కల్కి రిలీజ్ కు ముందే ఈ రేంజ్ లో రికార్డులు  బ్రేక్ చేస్తుంటే.. విడుదల అయ్యాక ఎలాంటి ప్రభంజానాన్ని సృష్టిస్తుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి