Tirupathi Rao
Kalki 2898 AD Universe: ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రంపై రోజుకో క్రేజీ వార్త వినిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా ఇదొక యూనివర్స్ కాబోతోంది అంటున్నారు.
Kalki 2898 AD Universe: ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రంపై రోజుకో క్రేజీ వార్త వినిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా ఇదొక యూనివర్స్ కాబోతోంది అంటున్నారు.
Tirupathi Rao
పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్– నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ మే 9న విడుదల కానున్న విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో అప్ డేట్స్, గాసిప్స్, వార్తలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇంకో క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. కల్కి సినిమా కేవంల రెండు పార్టులతో ఆగేది కాదని చెబుతున్నారు. ఏకంగా కల్కీని ఒక యూనివర్స్ లా మార్చి.. 9 చిత్రాలు విడుదల చేస్తారని టాక్ స్టార్ట్ అయ్యింది. ఇందులో ఎందరో గొప్ప గొప్ప స్టార్ట్ నటిస్తారంటూ చెబుతున్నారు. మరి.. ఆ యూనివర్స్ సాధ్యమేనా?
హాలీవుడ్ మూవీస్, యాక్షన్ సినిమాలు చూసేవారికి యూనివర్స్ అనే పేరు బాగా తెలిసే ఉంటుంది. హాలీవుడ్ లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అని.. డీసీ యూనివర్స్ అని ఉంటాయి. వీళ్లు కొందరు సూపర్ హీరోల పాత్రలను పరిచయం చేశారు. వాటిని బేస్ చేసుకుని వరుస చిత్రాలు తెరకెక్కిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు అందరూ సూపర్ హీరోలను ఒక చిత్రంలో పెడతారు. ఆ తర్వాత ఒక్కరి ఒక్కరి కథలు, వారి జర్నీని విడి విడిగా చూపిస్తూ ఉంటారు. అదే స్టైల్ లో ఇప్పుడు కల్కి సినిమాని కూడా ఒక యూనివర్స్ లా మార్చబోతున్నారు అని గట్టిగానే టాక్ నడుస్తోంది.
కల్కి 2898 ఏడీ మూవీ ప్లాట్ ఏంటో అందరికీ తెలుసు. పురాణాలు, ఇతిహాసాలు ఆధారంగా సూపర్ హీరోల కాన్సెప్ట్ లో సాగే సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఈ మూవీలో ప్రభాస్ మాత్రమే కాకుండా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే వంటి స్టార్ యాక్టర్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రానా, నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే ఈ అన్ని విషయాలపై ఫ్యాన్స్ కి కూడా ఒక క్లారిటీ ఉంది.
కల్కి మూవీ ప్రారంభం నుంచి మేకర్స్ చెబుతున్న మాట ఒక్కటే.. కల్కి చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాం అని. దానికి తగ్గట్లుగానే వరల్డ్ ఫేమస్ అయిన కామికాన్ లో కల్కి చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. మొదట ఒక సినిమా అనుకుంటే ఆ తర్వాత రెండు పార్టులు అని చెప్పారు. నాగ్ అశ్విన్ ఇది ఫ్రాంచైజ్ కాదని గతంలో క్లారిటీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు మాత్రం ఇది ఒక యూనివర్స్ అవుతుందని వార్తలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి. మార్వెల్, డీసీ తరహాలోనే దీనిని కూడా ఒక యూనివర్స్ లా మార్చేయబోతున్నారు అని టాక్ నడుస్తోంది. పైగా ఇందులో 9 చిత్రాలు ఉంటాయని కాన్ఫిడెంట్ గా కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారిని కేవలం అతిథి పాత్రకే పరిమితం చేయరంట. వారితో తర్వాత సినిమాలు ఉంటాయని తెలుస్తోంది.
అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ కూడా ఈ యూనివర్స్ లో భాగం అవుతారని హైప్ పెంచేస్తున్నారు. నిజానికి ఇవన్నీ అధికారిక సమాచారం కాకపోయినా.. ఇలా చేయడానికి కథలో అయితే స్కోప్ ఉందనే చెప్పాలి. అతిథి పాత్రలో వచ్చిన ఒక పాత్రకు సెపరేట్ స్టోరీని నెరేట్ చేసి ఆ క్యారెక్టర్ వర్షన్ లో మరో చిత్రాన్ని నిర్మించవచ్చు. దానిలో మళ్లీ ఈ సూపర్ హీరోస్ ని గెస్ట్ రోల్స్ లో చూపించవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే వినిపిస్తున్న ఈ వార్తలు నిజం అయ్యే ఆస్కారం లేదు అని కొట్టి పారేయలేం. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు కాస్త ఓపిక పట్టాల్సిందే. మరి.. కల్కి యూనివర్స్ కాబోతోంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.