iDreamPost

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ డూప్ పారితోషికం! అన్ని లక్షలా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ డూప్ కిరణ్ రాజ్ కి ఇచ్చే రెమ్యునరేషన్ విషయం హాట్ టాపిక్ గా మారింది. అతడికి ఒక్క సినిమాకు ప్రభాస్ లక్షల్లో పారితోషికం ఇస్తాడట. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ డూప్ కిరణ్ రాజ్ కి ఇచ్చే రెమ్యునరేషన్ విషయం హాట్ టాపిక్ గా మారింది. అతడికి ఒక్క సినిమాకు ప్రభాస్ లక్షల్లో పారితోషికం ఇస్తాడట. మరిన్ని వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ డూప్ పారితోషికం! అన్ని లక్షలా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ, ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ మూవీతో అభిమానులను మాస్ యాక్షన్ తో ఉర్రూతలూగించాడు. ఇక త్వరలోనే ‘కల్కి’ చిత్రంతో రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రభాస్ డూప్ కి ఇచ్చే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ డార్లింగ్ డూప్ కి ఇచ్చే పారితోషికం ఎంతో చూద్దాం.

సాధారణంగా ఇండస్ట్రీలో దాదాపు అందరి హీరోలకి బాడీ డబుల్ లేదా డూప్ లు ఉంటారన్న సంగతి మనందరికి తెలిసిందే. మూవీల్లో కొన్ని ఫైట్స్ సీన్స్, మరికొన్ని దృశ్యాల్లో ఇలాంటి డూప్ లను పెట్టి మ్యానేజ్ చేస్తుంటారు డైరెక్టర్లు. అలా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు డూప్ గా చేస్తున్నాడు కిరణ్ రాజ్ అనే వ్యక్తి. ఇతడు బాహుబలి సినిమాలో ప్రభాస్ కు డూప్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి పాపులారిటీ పెరగడంతో.. పలు ఇంటర్వ్యూల్లో సైతం కనిపించాడు. దీంతో అతడికి క్రేజ్ పెరిగింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇతడికి ఇచ్చే పారితోషికం గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మిగతా హీరోల డూప్ లకు నిర్మాతలే రెమ్మునరేషన్స్ ఇస్తారు. కానీ కిరణ్ రాజ్ కి ప్రభాసే పారితోషికం ఇస్తాడట. అది కూడా లక్షల్లో. ఇంతకీ కిరణ్ రాజ్ రెమ్యునరేషన్ ఒక్క సినిమాకు ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 30 లక్షలు అని సమాచారం. ఈ డబ్బు మెుత్తాన్ని ప్రభాసే చెల్లిస్తాడట. ఇతడికే కాదు.. తన సిబ్బంది అందరికి డార్లింగే జీతాలు ఇస్తాడని తెలుస్తోంది. అదీకాక కిరణ్ రాజ్ కు సినిమాను బట్టి కొన్ని కొన్ని సార్లు ఎక్కువే అందుతుందని టాక్. అయితే డూప్ కి 30 లక్షలు ఇస్తారనే రూమర్ నిజమైతే.. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకుంటే? చిన్నాచితక హీరోలకు కూడా ఒక్క సినిమాకు ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఉండదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Bramayugam Movie Review: మమ్ముట్టి ‘భ్రమయుగం’ రివ్యూ.. తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి