iDreamPost

మోడి సూచన పాటిస్తే కుప్ప కూలిపోవటమేనా … ఇంజనీర్లలో టెన్షన్

మోడి సూచన పాటిస్తే కుప్ప కూలిపోవటమేనా … ఇంజనీర్లలో టెన్షన్

ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆదివారం రాత్రం 9 గంటలకు 9 నిముషాల పాటు మొత్తం విద్యుత్ వాడకాన్ని నిలిపేయాలని పిలుపిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. నిజంగానే మోడి పిలుపును నూటికి నూరు శాతం పాటిస్తే దేశంలో విద్యుత్ వ్యవస్ధ మొత్తం కుప్ప కూలిపోతుందని ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఆందోళన పడుతున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ల వాదన ఏమిటయ్యా అంటే మామూలుగా దేశం మొత్తం మీద వాడే విద్యుత్ వాడకంతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్ధితుల్లో 40 శాతం వాడుతున్నారట.

పారిశ్రామిక వాడలు, వర్తక, వాణిజ్య సంస్ధలు, దాదాపు ప్రభుత్వ కార్యాలయలు, ప్రైవేటు కార్యాలయాలతో పాటు ప్రధానంగా ఐటి ఆఫీసులు అన్నీ మూత పడ్డాయి. దాంతో విద్యుత్ వాడకం ఒక్కసారిగా పడిపోయింది. ఇపుడు మొత్తం ఉత్పత్తిలో 40 శాతం మాత్రం ఉపయోగించుకుంటున్నారట. ఇపుడు మోడి పిలుపు ప్రకారం ఇళ్ళల్లో కూడా విద్యుత్ వాడకం కొద్ది నిముషాలు ఆపేసినా పెద్ద ప్రమాదం వస్తుందట.

మోడి చెప్పినట్లుగా ఇళ్ళల్లో కూడా విద్యుత్ ను ఆపేస్తే మొత్తం విద్యుత్ గ్రిడ్లు కుప్ప కూలిపోతాయని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా గ్రిడ్లు కుప్పకూలిపోతే మొత్తం విద్యతు ఉత్పత్తి మీదే తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఒకసారిగా విద్యుత్ గ్రిడ్లు కుప్పకూలిపోతే ఆసుపత్రులకు కూడా విద్యుత్ ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి మోడి చెప్పినట్లు మొత్తం లైట్లు బంద్ చేయటం కాకుండా కేవలం లైట్లు మాత్రమే ఆపాలని ఇంజనీర్లు సూచిస్తున్నారు.

అంటే ఆ 9 నిముషాలు ఏసిలు, ఫ్యాన్లు, ఫ్రిజుల స్విచ్చులను ఆఫ్ చేయద్దని సూచిస్తున్నారు. లేకపోతే అన్ బ్యాలెన్స్ అయి దేశం మొత్తం మీద విద్యుత్ ఉత్పత్తి గ్రిడ్లు కుప్ప కూలిపోతే మళ్ళీ వ్యవస్ధను పనిచేయించాలంటే చాలా కష్టమని ఇంజనీర్లు అప్పీలు చేస్తున్నారు. మరి మోడి ఏమంటారో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి