iDreamPost

కూతురు ఉన్న వారికి సుకన్య సమృద్ది యోజన.. మరి కొడుకులు ఉంటే? వాళ్ళకి బెస్ట్ సేవింగ్ స్కీమ్

  • Published Apr 11, 2024 | 5:48 PMUpdated Apr 16, 2024 | 6:24 PM

ఇంతవరకు మగపిల్లల కోసం ఎక్కడ ఎలాంటి స్కీమ్స్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టాలేదు. కానీ, మొదటిసారి మగపిల్లల కోసం కొన్ని ప్రత్యేక సేవింగ్ స్కీమ్స్‌ అనేవి అందుబాటులో ఉన్నాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంతవరకు మగపిల్లల కోసం ఎక్కడ ఎలాంటి స్కీమ్స్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టాలేదు. కానీ, మొదటిసారి మగపిల్లల కోసం కొన్ని ప్రత్యేక సేవింగ్ స్కీమ్స్‌ అనేవి అందుబాటులో ఉన్నాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Apr 11, 2024 | 5:48 PMUpdated Apr 16, 2024 | 6:24 PM
కూతురు ఉన్న వారికి సుకన్య సమృద్ది యోజన.. మరి కొడుకులు ఉంటే? వాళ్ళకి బెస్ట్ సేవింగ్ స్కీమ్

చాలామంది డబ్బును సంపాదించడం కోసం రకరకాల పనులు చేస్తుంటారు. అయితే ఇలా సంపాదించిన మొత్తంలో కొంత పొదుపును చేస్తే అది భవిష్యత్తులో వారి పిల్లలకు ఉపాయోగపడుతుందని భావిస్తుంటారు. అందుకోసం ప్రతిఒక్కరూ తాము సంపాదించిన దాంట్లో ఎంత కొంత సేవింగ్ చేయాలని అనుకుంటారు. కానీ, అది వారికి వచ్చిన ఆదాయం బట్టి ఎంత పొదుపు చేయాలనేది నిర్ణయించుకుంటారు. ఇప్పటికే చాలామంది పేరెంట్స్ తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి.. రకరకాలుగా పొదుపు చేస్తుంటారు. ఇందుకోసం ప్రభుత్వాలు సైతం పలు రకాల పథకాలను తీసుకొస్తున్నాయి. అయితే వీటిలో ఇప్పటి వరకు ఆడపిల్లల కోసమే ప్రభుత్వం అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టింది. కానీ, ఇంతవరకు మగ పిల్లల కోసం ఎక్కడ ఎలాంటి స్కీమ్ లను ప్రవేశ పెట్టాలేదు. అయితే ఎలాంటి రిస్క్ లేకుండా మగపిల్లల కోసం కూడా కొన్ని ప్రత్యేక సేవింగ్ స్కీమ్స్‌ అనేవి అందుబాటులో ఉన్నాయి. మరి ఆ వివరాళ్లోకి వెళ్తే..

పిల్లల భవిష్యత్తు కోసం ప్రతిఒక్క తల్లిదండ్రులు రకరకల స్కీమ్ ల్లో నగదును పొదుపు చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఆడపిల్లలకి తప్ప మగపిల్లడి ఎక్కడ ఎలాంటి స్కీమ్ కూడా అందుబాటులో లేదు. మరి వారి కోసం కూడా కొన్ని ప్రత్యేక స్కీమ్ లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ అందించడంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ పోస్ట్ ఆఫీస్ మొదటి స్థానంలో ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ కూడా మగ పిల్లల కోసం కొన్ని ప్రత్యేక సేవింగ్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. వీటిలో కిసాన్‌ పత్ర పథకం ఒకటి. తక్కువ మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారికి ఈ స్కీమ్‌ బెస్ట్ ఆప్షన్‌ అని చెప్పొచ్చు. ఇంతకీ పోస్టాఫీస్‌ అందిస్తోన్న  ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియా పోస్ట్‌ ఆఫీసు  అందిస్తోన్న ఈ పథకాన్ని 1988లో ప్రవేశపెట్టారు. అయితే ఈ స్కీమ్ ను మధ్య తరగతి కుటుంబాలకు సరిపోయేలా  తీసుకువచ్చారు. ఇందులో తల్లిదండ్రులు సంవత్సరానికి ఒక నిర్ధిష్ట మొత్తం పెట్టుబడి పెట్టుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ పథకంలో చేరాలంటే 18 ఏళ్లు నిండాల్సి ఉంటుంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి మొత్తం రూ.1000 కాగా, గరిష్ఠంగా లిమిట్ అంటూ ఏం లేదు. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తానికి 7.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏదైనా ఉంటే.. పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని మీరు ముందుగానే తీసుకోవచ్చు. కాగా, దీనికి వికాస్ పత్ర సర్టిఫికెట్‌ను ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు. ఇక మెచ్యురిటీ పీరియడ్ విషయానికొస్తే 10 సంవత్సరాల 4 నెలలుగా నిర్ణయించారు. ఈ స్కీమ్ ద్వారా తక్కువ వడ్డీరేటుకు తల్లిదండ్రులు లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. మరి, మగపిల్లల కోసం పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్న కొన్ని ప్రత్యేకమైన స్కీమ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి