iDreamPost
android-app
ios-app

సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం.. ఇక నుంచి వరంగల్‌లో ఆ సేవలు

  • Published May 19, 2024 | 11:51 AMUpdated May 19, 2024 | 11:51 AM

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు.

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు.

  • Published May 19, 2024 | 11:51 AMUpdated May 19, 2024 | 11:51 AM
సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం.. ఇక నుంచి వరంగల్‌లో ఆ సేవలు

తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాల పై చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కాట్టారు. అన్న మాట ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అనారోగ్యంతో బాధపడేవారికి రూ.10 లక్ష బీమా చెల్లింపుతో పాటు బీపీఎల్ కుటుంబానికి రూ.500 రూపాయల సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ బిల్లు పలు స్కీములు అమలు చేస్తున్నారు. తాజాగా వరంగల్ ప్రజలకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ వరంగల్ జిల్లా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వరంగల్ లో కొత్త ఎయిర్ పోర్ట్ నిర్మాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా అధికారులతో రేవంత్ బృందం చర్చలు జరపనుంది. వాస్తవానికి వరంగల్ లో కొత్త ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అవి మాత్రం కొలిక్కి రాలేదు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. వరంగల్ లో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ ఇటీవల ప్రకటించటంతో ఎయిర్ పోర్ట్స్ (ఏఏఐ) అధికారుల్లో కదలిక వచ్చిందని అంటున్నారు.

వరంగల్ లో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి వీలుగా ప్రస్తుతం ఉన్న 706 ఎకరాలకు అదనంగా మరో 253 ఎకరాలు కేటాయిస్తూ ఎన్నికల కోడ్ రాకముందే గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సైతం అనుమతి తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే భూ కేటాయింపు ఉత్తర్వుల నేపథ్యంలో AAI అదికారుల వరంగల్ ఎయిర్ పోర్ట్ పరిస్థితులపై క్షేత్ర స్థాయిలో గత ప్రభుత్వ హయాంలోనే పరిశీలన చేసినట్లు వార్తలు వచ్చాయి. ఎయిర్ పోర్ట్ దశల వారీగా విస్తరించాలని గత ప్రభుత్వ నిర్ణయించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి