69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన విషయం తెలిసిందే. దీంతో బన్నీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులు అల్లు అర్జున్ ని సత్కరిస్తూ.. పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు, దర్శకనిర్మాత, ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి బన్నీపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని నిజాలు వెల్లడించారు పోసాని. అల్లు అర్జున్ తనను ఇంటికి పిలిచి మరీ రూ. 5 లక్షల చెక్ ఇచ్చాడంటూ పోసాని చెప్పిన మాటలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఏ కారణం చేత బన్నీ, పోసానికి ఆ చెక్ ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా అభిమానులకు కష్టం వస్తే.. ఏ హీరో సహాయం చేయకుండా ఉండడు. అయితే కొందరు హీరోలు మాత్రం తాము చేసే సాయం కనిపిస్తే చాలు.. మేము కనిపించక్కర్లేదని అనుకుంటారు. అలాంటి హీరోలు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. ఈ విషయాన్ని స్వయంగా పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చాడు. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న పోసాని.. అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. పోసాని మాట్లాడుతూ..
” అల్లు అర్జున్ నాకు ఫోన్ చేసి, సర్ మా ఇంటికి కాఫీ తాగుదానికి వస్తారా? అని అడిగాడు. దాంతో నేను బన్నీ ఇంటికి వెళ్లాను. నేను వయసులో సీనియర్ అయినప్పటికీ.. అతడితో నాకు మంచి స్నేహం ఉంది. నేను అతని ఇంటికి వెళ్లి కాఫీ తాగుతుంటే.. నాకు రూ. 5 లక్షల చెక్ ను ఇచ్చాడు. నేను వెల్ సెటిల్డ్, నాకెందు ఈ డబ్బు అన్నాను. అందుకు బన్నీ.. సర్ మీరేంటో నాకు తెలుసు. మీ గురించి నేను చూశాను. డబ్బును వృథా చేయడం మీకు తెలీదు. వద్దు అనకుండా ఈ చెక్ తీసుకోండి అంటూ నా జేబ్ లో చెక్ పెట్టాడు బన్నీ” అని చెప్పుకొచ్చాడు పోసాని.
ఇక ఆ డబ్బును పోసాని ముగ్గురు పేద విద్యార్థుల చదువు కోసం వినియోగించినట్లుగా తెలిపారు. ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1.50 లక్షల చెక్ ఇచ్చినట్లు పోసాని వెల్లడించారు. బన్నీ మంచి యాక్టర్ అవుతాడని నేను ఏనాడో చెప్పినట్లు గుర్తు చేశారు పోసాని. అయితే పేద విద్యార్థుల పోసానికి థ్యాంక్స్ చెబితే.. థ్యాంక్స్ నాకు కాదు అల్లు అర్జున్ కు చెప్పండి అని వారిచేత బన్నీకి థ్యాంక్స్ చెప్పించారు పోసాని. ఈ విషయం బన్నీకి తెలిసి.. ఏంటి సార్ ఇలా చేశారు అంటూ తనని అడిగినట్లు పోసాని తెలియజేశాడు. మరి బన్నీ గురించి పోసాని చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.