iDreamPost
android-app
ios-app

ఈ పిల్లాడిని గుర్తించారా? విలన్ గా ఇతనికి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉంది!

  • Author ajaykrishna Published - 04:23 PM, Mon - 17 July 23
  • Author ajaykrishna Published - 04:23 PM, Mon - 17 July 23
ఈ పిల్లాడిని గుర్తించారా? విలన్ గా ఇతనికి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉంది!

సినీ ఫ్యామిలీకి చెందిన సెలబ్రిటీలైనా.. సొంతంగా పాపులర్ అయినవారైనా ఒక స్టేజ్ కి వచ్చాక వాళ్ళకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఆయా సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో మొదలవుతుంది. మీరు ఇప్పుడు పైన ఫోటోలో చూస్తున్న పిల్లాడు.. సినీ ఫ్యామిలీకి చెందినవాడే. పైగా ఇప్పుడు ఇండియా అంతటికి పరిచయం. రీసెంట్ గా సౌత్ ఇండియా ప్రేక్షకులను ఓ బిగ్గెస్ట్ మూవీతో పలకరించాడు. గట్టిగా గమనిస్తే.. ప్రెజెంట్ అతను ఎవరో ఇట్టే కనిపెట్టగలరు. కానీ.. ఇక్కడో మెలిక ఉంది. సౌత్ లో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా చేయలేదు.

ఇంకో విషయం ఏంటంటే.. నార్త్ లో ఈ పిల్లాడు.. బిగ్ స్టార్స్ లో ఒకడు. పైగా వయసుని లెక్క చేయకుండా రిస్క్ తో కూడుకున్న రోల్స్ చేయడంలో ఇతనికి పేరుంది. ఎవరో కొంచమైనా పోలికలు కనిపిస్తున్నాయా? ఎక్కడో చూసినట్లు అనిపిస్తున్నా.. గుర్తు రాట్లేదా? సరే.. ఇప్పుడో క్లూ ఇస్తా. ఇతను బాలీవుడ్ యాక్టర్. కానీ.. మనకు బాగా తెలిసినవాడే. దాదాపు 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. హీరోగా చేశాడు.. ఆ తర్వాత ఓ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆ హీరోయిన్ కపూర్ ఫ్యామిలీకి చెందింది. ఇప్పుడు గుర్తొచ్చే ఉంటుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు.. వారిద్దరూ ఇప్పుడు చిన్నపాటి సెలబ్రిటీలే.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఇతనికి స్టార్ హీరోయిన్ తో జరిగింది రెండో పెళ్లి. వయసులో ఇద్దరికి బాగానే తేడా ఉంటుందిలే. కానీ.. బాలీవుడ్ లో ఇవన్నీ మామూలే. అయితే.. మొదటి భార్యతో ఇతనికి ఓ కూతురు, ఓ కొడుకు. ఆ కూతురు ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్. యంగ్ హీరోల సరసన సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఎవరో తెలిసి పోయిందిగా.. ఇతను సైఫ్ అలీఖాన్. బాలీవుడ్ లో విలన్ గా సినిమాలు చేస్తూనే.. తెలుగులో ఆదిపురుష్ మూవీతో పరిచయం అయ్యాడు. అందులో రావణ్ క్యారెక్టర్ లో సైఫ్ మెరిసాడు. అయితే.. సైఫ్ ప్రముఖ క్రికెటర్ పటౌడి ఫ్యామిలీకి చెందినవాడు. లెజెండరీ యాక్టర్ షర్మిల ఠాకూర్ కొడుకు సైఫ్. మరి ప్రస్తుతం సైఫ్ చిన్నప్పటి పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ పిల్లాడి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

marsbahis giriş