iDreamPost

50 ఏళ్ల కెరీర్‌లో రజినీ మూవీకి ఇలాంటి కలెక్షన్లా? పరువు పోయింది!

ఆల్ ఓవర్ ఇండియానే కాదూ.. ఓవర్సీస్ లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ నటుడు రజినీకాంత్. జైలర్ మూవీ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత లాల్ సలామ్ అంటూ ఫిబ్రవరి 9న విడుదల అయ్యింది.

ఆల్ ఓవర్ ఇండియానే కాదూ.. ఓవర్సీస్ లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ నటుడు రజినీకాంత్. జైలర్ మూవీ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత లాల్ సలామ్ అంటూ ఫిబ్రవరి 9న విడుదల అయ్యింది.

50 ఏళ్ల కెరీర్‌లో రజినీ మూవీకి ఇలాంటి కలెక్షన్లా? పరువు పోయింది!

కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. ఈ విషయం సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలో నిజం. తన స్టైల్, డైలాగ్స్‌తోనే కాదూ.. ఆయన కనిపిస్తే చాలు సినిమా బంపర్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది. స్పెషల్ రోల్స్ చేసినా.. అతడ్ని మాత్రమే చూసేందుకు థియేటర్లకు ఎగబడేవారు జనాలు. అలాంటి ఓ స్టార్ నటుడు క్యామియో రోల్ చేసిన మూవీ లాల్ సలామ్. ఫిబ్రవరి 9న విడుదలై.. కనీస కలెక్షన్లు పక్కన పెడితే.. భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఆయన 50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఊహించని విధంగా వసూళ్లు రావడం బహుశా ఇదే తొలి సారి కావచ్చు. అదీ కూడా స్టార్ డమ్ వచ్చాక. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా దీన్ని నిర్మించారు. రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ ఈ మూవీకి దర్శకురాలు.

ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను సుమారు 80-90 కోట్ల వరకు ఖర్చు పెట్టారని టాక్. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా తమిళ్, తెలుగులో రిలీజ్ అయ్యింది లాల్ సలామ్. తెలుగులో విడుదల విషయంలో కాస్త జాప్యం చోటుచేసుకుంది. పలు చోట్ల మార్నింగ్ షోస్ కూడా రద్దయ్యాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ.. నిరాశను మిగిల్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేకపోయారు. దీంతో పలు చోట్ల స్క్రీనింగ్ నుండి తగ్గిపోయింది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు రూ. 7 కోట్ల రూపాయలను మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. రజినీ సినిమా అంటే తమిళనాటే కాకుండా తెలుగు, ఓవర్సీస్‌లో కూడా విపరీతమైన హైప్ ఉంటుంది. ప్రీ రిలీజ్ బిజినెస్సే కోట్లలో జరుగుతుంది. అలాంటింది.. ఐదు రోజుల వసూళ్లు చేస్తుంటే.. సినిమా ఎంతటి డిజాస్టరో అర్థమౌతుంది. ఆయన మొత్తం పరువు ఈ మూవీతో పోయినట్లు అయ్యింది.

Shame like never before in 50 years!

ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణం. ఆయన ఒక్క రోజు కలెక్షనే కోట్ల రూపాయాలు దాటుతుంది. కోటి రూపాయలు అందుకోవడానికి నాలుగైదు రోజులు పట్టింది. ఏపీ, నైజాంలో తొలి మూడు రోజులు రూ. 30 లక్షలు మాత్రమే వసూలు చేయగా.. మరుసటి రెండు రోజులు రూ. 25 లక్షలకు వసూళ్లు పడిపోయాయి. గత ఐదు రోజుల్లో కేవలం రూ. 1.4 కోట్ల కలెక్షన్ వచ్చింది. పొనీ ఇక్కడ అనుకుంటే ప్రమోషన్ లేదు అనుకోవచ్చు.. కానీ.. తమిళనాడులో కూడా పేలవమైన వసూళ్లను రాబట్టుకుంది లాల్ సలామ్ మూవీ. తమిళనాడులో ఈ ఐదు రోజుల్లో రూ. 11 కోట్లను మాత్రమే వసూలు చేయగలిగింది. ఇందులో రజినీకాంత్ మోయిద్దీన్ బాయ్ పాత్రలో కనిపించారు. కీలక పాత్ర అయినప్పటికీ.. ఆయన నిడివి చాలా ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ.. ప్రేక్షకులు ఈ సినిమాపై డబ్బులు పెట్టేందుకు ఇష్టపడలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి