iDreamPost

OTT Movie: OTT లోకి వస్తున్న లవ్ టుడే హీరోయిన్ మరొక మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published May 08, 2024 | 5:58 PMUpdated May 08, 2024 | 5:58 PM

థియేటర్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేని సినిమాలన్నీ కూడా త్వరగా ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.

థియేటర్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేని సినిమాలన్నీ కూడా త్వరగా ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.

  • Published May 08, 2024 | 5:58 PMUpdated May 08, 2024 | 5:58 PM
OTT Movie:  OTT లోకి వస్తున్న లవ్ టుడే హీరోయిన్ మరొక మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

అవి ఎంత పెద్ద సినిమాలైనా సరే.. ఎందుకో ఆశించిన స్థాయిలో థియేటర్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతాయి. కానీ ఓటీటీ లో మాత్రం ఆ సినిమాలు మంచి వ్యూవర్ షిప్ తో దూసుకుపోతుంటాయి. కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ థియేటర్ లో ఆయా సినిమాలకు రాని ఆదరణ ఓటీటీ లో మాత్రం లభిస్తుంది. ఈ క్రమంలో ఇలా సక్సెస్ అయిన సినిమాలను ఎన్నో చూసాము. ఇక ఇప్పడు మరొక సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా కాకుండానే.. ఓటీటీ వైపు అడుగులు వేసేస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు “కల్వన్” .. తెలుగులో “చోరుడు” టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. ఓ వైపు సంగీత దర్శకుడిగా , మరో వైపు హీరోగా మంచి పేరు సంపాదించుకుంటున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. జీవి ప్రకాశ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమానే కల్వన్. తెలుగు రిలీజ్ కు సంబంధించిన పోస్టర్ ను కూడా గతంలో రిలీజ్ చేశారు. ఇక తమిళంలో ఈ సినిమాను ఏప్రిల్ 4 థియేటర్స్ లో విడుదల చేశారు. అయితే తమిళంలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో.. ఇక తెలుగు రిలీజ్ ను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక ఇప్పడూ ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాను మే 14 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు హాట్ స్టార్ ప్రకటించింది.

ఇంకా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేసారు. కల్వన్ సినిమాకు పీవీ శంకర్ దర్శకుడిగా వ్యవహరించారు. మరి ఈ సినిమా ఓటీటీ లో ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఈ మధ్య కాలంలో తమిళ సినిమాలను కూడా ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే.. కథను బట్టి ప్రేక్షకులు ఆయా సినిమాలను వైరల్ చేస్తున్నారు, ఈ తరహాలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. మరి కల్వన్ సినిమా అదృష్టం ఓటీటీ లో ఎలా ఉండబోతుంది అనేది సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వేచి చూడాలి. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి