iDreamPost

SRH vs LSG: వీడియో: తెలుగోడి స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన డికాక్!

  • Published May 08, 2024 | 8:29 PMUpdated May 08, 2024 | 8:41 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ ఆల్​రౌండర్ నితీష్​ కుమార్ రెడ్డి కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్నాడు. అతడి క్యాచ్​కు అపోజిషన్ బ్యాటర్ క్వింటన్ డికాక్ నోరెళ్లబెట్టాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్ ఆల్​రౌండర్ నితీష్​ కుమార్ రెడ్డి మ్యాచ్​ మ్యాచ్​కు మరింత ఇంప్రూవ్ అవుతున్నాడు. ఇప్పటికే అద్భుతమైన బ్యాటింగ్​తో అందరి మనసులు దోచుకున్న ఈ తెలుగోడు అవకాశం వచ్చినప్పుడు బంతితోనూ మ్యాజిక్ చేస్తున్నాడు. తాజాగా ఫీల్డింగ్​లోనూ తాను తోపేనని ప్రూవ్ చేసుకున్నాడు. లక్నో సూపర్ జియాంట్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు నితీష్. అతడి క్యాచ్ చూసి లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్ నోరెళ్లబెట్టాడు.

మూడో ఓవర్ తొలి బంతికి డికాక్​ను ఔట్ చేశాడు భువనేశ్వర్ కుమార్. హార్డ్ లెంగ్త్​లో అతడు వేసిన బాల్​ను బలంగా బాదాడు డికాక్.​ తన జోన్​లో ఉండటంతో బంతిని స్టాండ్స్​లోకి తరలిద్దామని అనుకున్నాడు. అయితే ఆ పికప్ షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బౌండరీ లైన్ దగ్గర కాచుకొని ఉన్న నితీష్​ రెడ్డి పర్ఫెక్ట్ జంప్​తో క్యాచ్​ను అందుకున్నాడు. అయితే బాడీ బ్యాలెన్స్ తప్పడంతో బాల్​ను గాల్లో త్రో చేసి.. తాను ఫెన్స్ దాటాడు. బాల్ కింద పడేలోగా మళ్లీ గ్రౌండ్​లోకి వచ్చి అందుకున్నాడు. బౌండరీ లైన్ దగ్గర అతడి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అవేర్​నెస్, బాడీ బ్యాలెన్స్ అద్భుతంగా ఉన్నాయి. దీంతో ఈసారి ఐపీఎల్​లో ఇదే బెస్ట్ క్యాచ్ అని నెటిజన్స్ అంటున్నారు. మరి.. నితీష్ క్యాచ్​పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి