iDreamPost

లగ్జరీ కారు కొన్న బుట్టబొమ్మ.. ధర ఎంతో తెలిస్తే షాకే?

తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కాగా పూజా తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది.

తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కాగా పూజా తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది.

లగ్జరీ కారు కొన్న బుట్టబొమ్మ.. ధర ఎంతో తెలిస్తే షాకే?

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్ఢే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మత్తెక్కించే అందం, ఒంపు సొంపులతో వయ్యారాలు ఒలకబోస్తూ యూత్ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించిన బుట్టబొమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కాగా పూజా తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దసరా ఫెస్టివల్ ను పురస్కరించుకుని కొత్త కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటూ హాట్ పోజులతో కుర్రకారును ఫిదా చేస్తుంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ అమ్మడుకి ఫాలోవర్స్ కూడా ఎక్కువే. దీంతో పూజకు సంబంధించిన ఏ అంశమైనా క్షణాల్లో వైరల్ గా మారుతుంటుంది. కాగా, తాజాగా పూజా హెగ్డే ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. దసరా పండగ సందర్భంగా లగ్జరీ కారును సొంతం చేసుకున్నారు. రేంజ్ రోవర్‌కు చెందిన లగ్జరీ ఎస్‍యూవీని ఆమె కొత్తగా కొనుగోలు చేశారు.

పూజా హెగ్డే కొనుగోలు చేసిన అత్యాధునిక ఫీచర్లు కలిగిన రేంజ్ రోవర్ ఎస్‍యూవీ మోడల్ కారు ధర సుమారు రూ.4కోట్లుగా ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా.. ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన పూజా హెగ్డే కొత్త కారు నుంచి దిగుతుండగా కెమెరాల కంట పడింది. దీంతో కారు ముందు ఆమె కెమెరాలకు పోజులు ఇచ్చారు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన పూజా ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి