iDreamPost

పొన్నియన్ సెల్వన్ – తెలుగులోనే రిస్కు

తమిళనాడులో దీని ఫీవర్ ఓ రేంజ్ లో ఉంది. తెల్లవారుఝామున 4 గంటలకే షోలు మొదలుపెడుతున్నారు.

తమిళనాడులో దీని ఫీవర్ ఓ రేంజ్ లో ఉంది. తెల్లవారుఝామున 4 గంటలకే షోలు మొదలుపెడుతున్నారు.

పొన్నియన్ సెల్వన్ – తెలుగులోనే రిస్కు

ఇంకో రెండు రోజుల్లో మణిరత్నం విజువల్ వండర్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 భారీ ఎత్తున విడుదల కాబోతోంది. తమిళనాడులో దీని ఫీవర్ ఓ రేంజ్ లో ఉంది. తెల్లవారుఝామున 4 గంటలకే షోలు మొదలుపెడుతున్నారు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, శరత్ కుమార్ ఇలా ఎవరికి వారు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న మల్టీ స్టారర్ కావడంతో బుకింగ్స్ హోరెత్తిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి షో పడేలోపు అక్కడ ప్రీమియర్ రిపోర్ట్ లు, రివ్యూలు బయటకి వచ్చేస్తాయన్న మాట. అయితే తెలంగాణ, ఏపిలోనే పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఉండాల్సినంత బజ్ కానీ హైప్ కానీ అంతగా జాడ లేదు.

దిల్ రాజు పొన్నియన్ సెల్వన్ ని సుమారు 10 కోట్లకు థియేట్రికల్ డీల్ చేశారని ట్రేడ్ టాక్. అది కూడా అడ్వాన్స్ బేసిస్ మీదేనట. ఒకవేళ ఏదైనా తేడా వచ్చి రికవరీ కాకపోతే పూర్తి సొమ్మును వాపసు చేసే నిబంధన మీద ఒప్పందాలు జరిగాయని వినికిడి. టీమ్ తరఫున రెండు కోట్ల విలువైన పబ్లిసిటీకి హామీ వచ్చిందట. అంతా బాగానే ఉంది కానీ ఇంత మొత్తం రావాలంటే జనంలో ఈ సినిమా పట్ల విపరీతమైన ఆసక్తి ఉండాలి. ఎంత భారీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ వాళ్ళెవ్వరికీ ఇక్కడ పెద్ద మార్కెట్ లేదు. దానికి తోడు పొన్నియన్ సెల్వన్ అనేది పూర్తిగా తమిళ నేటివిటీకి చెందిన యుద్ధవీరుడి నవల. సైరా నరసింహారెడ్డికి ఇతర ప్రాంతాల్లో వచ్చిన సమస్యే ఇప్పుడు దీనికి వచ్చింది.
ponniyin salvan
పార్ట్ 1 విజయం సాధిస్తేనే రెండోదాని మీద బిజినెస్ పరంగా నెగటివ్ ఎఫెక్ట్ ఉండదు. బాహుబలి, కెజిఎఫ్ లు అందుకే బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యాయి. కానీ పిఎస్ 1 కేస్ వేరుగా ఉంది. అత్యధుతంగా ఉందనే టాక్ వస్తేనే జనం హాళ్లకు కదులుతారు. ఆ మధ్య మోహన్ లాల్ మరక్కార్ అరేబియా సింహంకు సైతం ఇదే తరహా హడావిడి చేశారు కానీ దాని ఫలితం ఏమైందో తెలిసిందే. అది కూడా ఆషామాషీ దర్శకుడు తీసింది కాదు. ప్రియదర్శన్ లాంటి లెజెండే తెరకెక్కించారు. పిఎస్ 1కు ఆలా జరగకూడదనే అభిమానుల ఆకాంక్ష. ఏఆర్ రెహమాన్ సంగీతం, రెండు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ గ్రాండియర్ ఫలితం ఇంకో నలభై ఎనిమిది గంటల్లో తేలనుంది. చూడాలి ఏం చేయనుందో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి