iDreamPost
android-app
ios-app

Thalapathy Vijay: చిక్కుల్లో ‘లియో’ మూవీ.. దళపతి విజయ్ పై పోలీస్ కేసు!

  • Author Soma Sekhar Published - 05:56 PM, Mon - 26 June 23
  • Author Soma Sekhar Published - 05:56 PM, Mon - 26 June 23
Thalapathy Vijay: చిక్కుల్లో ‘లియో’ మూవీ.. దళపతి విజయ్ పై పోలీస్ కేసు!

సాధారణంగా ఒక సినిమా ప్రారంభం అయ్యి.. విడుదల అయ్యే సమయానికి ఆ సినిమాను ఎన్నో వివాదాలు చుట్టు ముడుతూ ఉంటాయి. ఇక సినిమాలోని నటీ, నటులపై అప్పుడప్పుడు పోలీస్ కేసులు కూడా నమోదు అవుతూ ఉంటాయి. తాజాగ తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకి విజయ్ పై పోలీస్ కేసు ఎందుకు అయ్యింది? ఎవరు పెట్టారు? ఇప్పుడు తెలుసుకుందాం.

దళపతి విజయ్.. తమిళ్ ఇండస్ట్రీలోనే కాక తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ్ లో విజయ్ కు ఎంత క్రేజ్ ఉందో.. దాదాపుగా టాలీవుడ్ లో కూడా అంతే క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’ మూవీలో నటిస్తున్నాడు విజయ్. తాజాగా విజయ్ పుట్టిన రోజు సందర్భంగా లియో నుంచి ‘నా రెడీ’ పాటను విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ పాట విడుదల చేసినప్పటి నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. విజయ్ ఫ్యాన్స్ ఈ సాంగ్ ను మళ్లీ మళ్లీ వింటున్నారు.

ఈ క్రమంలోనే విజయ్ పై పోలీస్ కేసు నమోదు అయ్యిందని తెలిసి ఫ్యాన్స్ షాక్ కు గురైయ్యారు. చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త ఆర్ టీ సెల్వం విజయ్ పై పోలీస్ కేసు పెట్టాడు. విజయ్, చిత్ర యూనిట్ పై ఆన్ లైన్ లో నార్కోటిక్స్ కంట్రోల్ యాక్ట్ కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. అసలు విషయం ఏంటంటే? లియో నుంచి విడుదల అయిన సాంగ్ లో విజయ్ మెుదటి నుంచి చివరి వరకు సిగరెట్ తాగుతూ కనిపించడమే కారణం. సాధారణంగా సినిమాల్లో హీరోలు సిగరెట్లు తాగడం సహజమే. అయితే తమిళనాడులో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ.. విద్యార్థులకు రోల్ మోడల్ గా ఉంటూ వచ్చిన విజయ్.. ఇలా సిగరెట్ తాగుతూ కనిపించడం బాగోలేదని ఫిర్యాదు చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. ప్రస్తుతం కశ్మీర్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది లియో. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న లియో.. అక్టోబరు 19న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet