iDreamPost

సొంతంగా వ్యాపారం చేస్తారా? కేంద్రం నుండి మీకు ఈజీగా లోన్!

  • Published Nov 30, 2023 | 2:13 PMUpdated Nov 30, 2023 | 2:13 PM

చిన్న వ్యాపారం ప్రారంభించాలన్న ఎంతో కొంత పెట్టుబడి కావాలి. అలాంటి వారిని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే దీని కింద 70 లక్షల మంది రుణాలు ఇచ్చింది. ఆ పథకం వివరాలు..

చిన్న వ్యాపారం ప్రారంభించాలన్న ఎంతో కొంత పెట్టుబడి కావాలి. అలాంటి వారిని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే దీని కింద 70 లక్షల మంది రుణాలు ఇచ్చింది. ఆ పథకం వివరాలు..

  • Published Nov 30, 2023 | 2:13 PMUpdated Nov 30, 2023 | 2:13 PM
సొంతంగా వ్యాపారం చేస్తారా? కేంద్రం నుండి మీకు ఈజీగా లోన్!

మన సమాజంలో ఉద్యోగం చేయాలని భావించేవారు ఎందరు ఉన్నారో.. అలానే సొంతంగా వ్యాపారం చేస్తూ తమ కాళ్ల మీద నిలబడటమే కాక మరో నలుగురికి ఉపాధి కల్పించాలని భావించేవారు చాలా మందే ఉన్నారు. అయితే బిజినెస్ చేయడం అంటే ఆశామాషీ వ్యవహారం కాదు. ఎంతో అనుభవంతో పాటు.. పెట్టుబడి కూడా బాగానే కావాలి. ఎంత చిన్న వ్యాపారం ప్రారంభించాలన్న సరే కనీసం 1-3 లక్షల రూపాయల లోపు ఖర్చవుతుంది. అంత మొత్తం పేద, మధ్య తరగతి వారి దగ్గర ఉండాలంటే కష్టం. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలన్న పెట్టుబడి దొరకడం కష్టం. అదిగో అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సొంతంగా చిరు వ్యాపారం ప్రారంభించాలనుకునేవారి కోసం ఓ పథకాన్ని తీసుకొచ్చి.. రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది. దీని ద్వారా ఇప్పటికే సుమారు 70 లక్షల మందిని ఆదుకుంది ప్రభుత్వం. మరి ఆ పథకం వివరాలు ఏంటి అంటే..

చిరు వ్యాపారులను ఆదుకోవడం కోసం కేంద్రం తీసుకువచ్చిన పథకమే ‘పీఎం స్వానిధి యోజన’. కోవిడ్‌ సమయంలో చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయ అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా ఇప్పటికి ఎన్నో లక్షల మంది లబ్దిపొందారు. ఈ పథకం కింద ఇప్పటివరకు సుమారు 70 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. చిరు వ్యాపారులను ఆదుకోవడం కోసం తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల వరకు రుణాలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం.

చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఉద్దేశించిన ఈ పథకం కింద మొదటిసారిగా మీరు ఎటువంటి హామీ లేకుండా 10,000 రూపాయల వరకు రుణ మొత్తాన్ని పొందవచ్చు. అలాగే తీసుకున్న రుణం మొత్తాన్ని 12 నెలల్లోపు తిరిగి చెల్లించాలి. ఆ తర్వాత, మీరు రెండవసారి రూ. 20,000, మూడవసారి రూ. 50,000 రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద లబ్ధిదారులందరికీ 7 శాతం చొప్పున వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది.

ఈ లోన్ పొందడం కోసం మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీకు బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకం విశేషమేమిటంటే ఇప్పటి వరకు 43 శాతం మంది చిన్న మహిళా వ్యాపారులు దీని ద్వారా ఆర్థిక సహాయం పొందారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నివేదిక ప్రకారం, ఈ పథకం కింద ఇప్పటివరకు 70 లక్షల రుణాలు అందించగా, మొత్తం 9,100 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి అని తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి